రాష్ట్రస్థాయి బీచ్ వాలీబాల్ పోటీల్లో జిల్లా జట్ల ప్రత
ఖమ్మం స్పోర్ట్స్: రాష్ట్రస్థాయి పాఠశాలల అండర్–17 బాలబాలికల బీచ్ వాలీబాల్ పోటీలను ఖమ్మం సీక్వెల్ రిసార్ట్స్‌లోని కృత్రిమ బీచ్‌లో సోమవారం జరిగాయి. పోటీలకు పాత పది జిల్లాల నుంచి 60 మంది క్రీడాకారులు హాజరయ్యారు. ఈమేరకు బాలుర విభాగంలో ఖమ్మం జట్టు విజేతగా నిలవగా, రెండు, మూడో స్థానాల్లో మెదక్, నిజామాబాద్ జట్లు నిలిచాయి. ఇక బాలికల విభాగంలో ప్రథమస్థానం నిజామాబాద్ జట్టు సాధించింది. ద్వితీ య, తృతీయ స్థానాల్లో ఖమ్మం, హైదరాబాద్ జట్లు నిలిచాయి. విజేతల జట్లకు పోటీల రాష్ట్ర పరిశీలకులు మధు అందజేయగా, వాలీబాల్ అసోసియేషన్‌జిల్లాకార్యదర్శి బి.గోవిందా రెడ్డి, జిల్లా పాఠశాలల క్రీడల కార్యదర్శి వై.రామారావుతో పాటు డి.సైదులు, ఆదర్శ్‌కుమార్, నాగూల్‌మీరా, చిన్ని, అంజయ్య పాల్గొన్నారు.
విధుల్లో చేరిన
విద్యుత్ ఎస్‌ఈ
ఖమ్మం వ్యవసాయం: వ్యక్తిగత సెలవులో ఉన్న విద్యుత్ శాఖ ఖమ్మం సర్కిల్ ఎస్‌ఈ శ్రీనివాసాచారి సోమవారం విధుల్లో చేరారు. ఇప్పటి వరకు కొత్తగూడెం ఎస్‌ఈ ఇన్‌చార్జిగా ఇక్కడ విధులు నిర్వర్తించారు.
‘కంపా’ నిధులు
ఎన్ని కేటాయించారు?
ఖమ్మంమయూరిసెంటర్: సాగునీరు, విద్యుత్ సహా వివిధ రకాల ప్రాజెక్టుల కోసం తీసుకునే అటవీ భూములకు ప్రత్యామ్నాయంగా ఇచ్చే భూముల్లో అడవుల పునరుద్ధరణ, ప్రత్యామ్నాయ అటవీకరణ కోసం కాంపెన్సేటరీ అఫారేస్టేషన్ మేనేజ్మెంట్ ప్లానింగ్ అథారిటీ(కంపా) నిధులను ఎంత మేర కేటాయించారని ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి ప్రశ్నించారు. తెలంగాణకు ఇప్పటివరకు ఎన్ని నిధులు కేటాయించారని ఆయన సోమవారం లోక్‌సభలో అడిగారు. దీంతో ‘కంపా’ నిధుల్లో భాగంగా తెలంగాణకు ఇప్పటివరకు రూ.3,852.61 కోట్లు అందించినట్లు కేంద్ర అటవీ శాఖ సహాయ మంత్రి సమాధానం ఇచ్చారు.
పంట అవశేషాలను
కాల్చొద్దు
మధిర: రైతులు పంట కోతకాలం పూర్తయ్యాక అవశేషాలను కాల్చొద్దని జిల్లా వ్యవసాయాఽధికారి డి.పుల్లయ్య సూచించారు. మండలంలోని ఖమ్మంపాడులో సోమవారం పర్యటించిన ఆయన రైతులతో మాట్లాడారు. పత్తి, వరి పంటల అవశేషాలను కాలిస్తే అనేక నష్టాలు ఎదురవుతాయని చెప్పారు. అలాకాకుండా భూమిలో కలియదున్నితే భూసారం పెరుగుతుందని వివరించారు. మండల వ్యవసాయాధికారి కనకం సాయిదీక్షిత్, ఏఈఓ సుష్మ తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్రస్థాయి బీచ్ వాలీబాల్ పోటీల్లో జిల్లా జట్ల ప్రత


