రామనామంతో మార్మోగిన భద్రగిరి
భద్రాచలం: భద్రగిరి మాఢ వీదులు జై శ్రీరామ్ నామస్మరణతో మార్మోగాయి. భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో భక్తులు చేపట్టిన శ్రీరామ పునర్వసు దీక్షను సోమవారం విరమించారు. ఆలయ ఈఓ కె.దామోదర్‌రావు దంపతులు శ్రీరామ పాదుకలను శిరస్సుపై ధరించగా.. మంగళ వాయిద్యాల నడుమ గిరిప్రదక్షిణ నిర్వహించారు. శ్రీరామదాసు విగ్రహానికి పూలమాలలు అలంకరించారు. అనంతరం బేడా మండపంలో శ్రీరామ దీక్షా విరమణ పూజలు, సంక్షిప్త రామాయణ హవనం జరిపారు. ఆ తర్వాత సీతాలక్ష్మణ సమేత రామచంద్రస్వామికి పంచామృతాలతో స్నపన తిరుమంజనం జరిపించారు.
ఆలయానికి
రూ.లక్ష విలువైన టేబుల్
మధిర: మధిరలోని శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో స్వామి కల్యాణానికి ఉపయోగించే రూ.లక్ష విలువైన టేబుల్‌ను మేళ్లచెరువు పృధ్వీకృష్ణ – దేవి ప్రియాంక దంపతులు సోమవారం అందజేశారు. అనంతరం స్వామిని దర్శించుకుని పూజలు చేయగా, ఆలయ కమిటీ బాధ్యులు వారిని సన్మానించారు.
ఆచార్లగూడెం
ఫొటోగ్రాఫర్‌కు అవార్డు
నేలకొండపల్లి: మండలంలోని ఆచార్లగూడెంకు చెందిన ఫొటోగ్రాఫర్ నవీన్‌కు జాతీయ స్థాయి అవార్డు లభించింది. ‘తెలుగు ఆర్ట్ ఫొటోగ్రఫీ’ సొసైటీ ఆధ్వర్యాన ఇటీవల నిర్వహించిన పోటీల్లో 60 మంది ఫొటోగ్రాఫర్లు పాల్గొనగా, ‘మదర్ అండ్ చైల్డ్’ విభాగంలో నవీన్ ఎంపికయ్యాడు. ఈ సందర్భంగా మొదటి బహుమతి అందుకున్న ఆయనను పలువురు అభినందించారు.
వైభవంగా పునర్వసు దీక్ష విరమణ
రామనామంతో మార్మోగిన భద్రగిరి
రామనామంతో మార్మోగిన భద్రగిరి


