హాస్టల్ నుంచి బయటకు వెళ్లిన విద్యార్థులు
కారేపల్లి: పట్టించుకునే వారెవరూ లేకపోవడంతో పలువురు విద్యార్థులు హాస్టల్ నుంచి బయటకు వెళ్లగా.. రోడ్డుప్రమాదంలో ఒకరికిగాయా లైన ఘటన ఇది. మండలంలోని ఉసిరికాయలపల్లి బాలుర ఆశ్రమపాఠశా ల వార్డెన్ బాల్‌సింగ్ తన స్వగ్రామానికి, హెచ్‌ఎం ధర్మా ఎన్నికల విధులకు వెళ్లారు. ఇన్‌చార్జి హెచ్‌ఎం రమేష్, మరో ఇద్దరు ఉపాధ్యాయులు ఆది వారం హాస్టల్‌లో విధులు నిర్వర్తించగామధ్యాహ్నం ఇద్దరు ఉపాధ్యాయులు విధులు ముగించుకుని వెళ్లిపోయారు. ఆతర్వాత వార్డెన్ లేకపోవడంతో పలువురు విద్యార్థులు హాస్టల్ నుంచి బయటకు వచ్చారు. రహదారిపై ద్విచక్రవాహనదా రులను లిఫ్ట్ అడిగి ఇల్లెందు చేరుకుని కాసేపు గడిపాక తిరిగి ద్విచక్ర వాహనదారులను లిఫ్ట్ అడుగు తూ బయలుదేరారు. ఈక్రమాన 9వ తరగతి చదువుతున్న రఘునాథపాలెం మండలం దోనబండకు చెందిన భూక్యా సాగర్ ఒకరి వాహనంపై వస్తుండగా, ఇల్లెందులో మరో వాహనం ఢీకొట్టగా సాగర్‌కు తీవ్రగాయాలయ్యాయి. దీంతో స్థానికులు ఇల్లెందు ఆస్పత్రికి తరలించి ఇన్‌చార్జి హెచ్‌ఎం రమేష్‌కు సమాచా రం ఇచ్చారు. ఆయన కొత్తగూడెంకు, ఆపై ఖమ్మం తరలించి చికిత్స చేయిస్తున్నారు. ఘటనకు సంబంధించి ఖమ్మం ఏటీడీఓ రమేష్ సోమవారం పాఠశాలలో విచారణ చేపట్టారు. ఇదిలా ఉండగా హాస్టల్ వా ర్డెన్, ఇన్‌చార్జ్ హెచ్‌ఎం నిర్లక్ష్యంతోనే ఈ ఘటన జరి గిందని సాగర్ తల్లిదండ్రులు ఆరోపించారు. ఆయన కన్ను, తలభాగంలో తీవ్రగాయాలు కాగా శస్త్రచికిత్స చేయాలని వైద్యులు సూచించడం వైద్యఖర్చులు తానే భరిస్తానని వార్డెన్ ఒప్పుకున్నట్లు తెలిసింది.
రోడ్డు ప్రమాదంలో
ఒకరికి తీవ్రగాయాలు


