●రెబల్స్‌కు మద్దతు ఇస్తే చర్యలు
సత్తుపల్లిటౌన్: గ్రామపంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సూచించిన అభ్యర్థులపై పోటీ చేస్తున్న రెబల్స్, వారికి సహకరించే వారిపైనా క్రమశిక్షణా చర్యలు తప్పవని డీసీసీ అధ్యక్షుడు నూతి సత్యనారాయణ హెచ్చరించారు. సత్తుపల్లిలో సోమవారం ఆయన ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్‌తో కలిసి మాట్లాడారు. పార్టీ లైన్‌కు భిన్నంగా వ్యవహరించే వారు ఎవరైనా ఉపేక్షించేది లేదన్నారు. కాగా, గ్రామపంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థుల విజయానికి పార్టీ శ్రేణులు పాటుపడాలని కోరారు. సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వాన అమలవుతున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రజలకు వివరించాలని సూచించారు. ఎమ్మెల్యే రాగమయి మాట్లాడుతూ పార్టీ అభ్యర్థుల విజయం కోసం కట్టుపడే వారికి భవిష్యత్‌లో పదవుల్లో ప్రాధాన్యత ఇస్తామని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ మండల, పట్టణ అధ్యక్షులు గాదె చెన్నారావు, శివవేణు, నాయకులు తోట సుజలరాణి, పింగళి సామేలు, చల్లారి వెంకటేశ్వరరావు, భాగం నీరజ, పసుమర్తి చందర్‌రావు, నాగుల్‌మీరా, మానుకోట ప్రసాద్, ప్రభాకర్, దూదిపాల రాంబాబు పాల్గొన్నారు.
డీసీసీ అధ్యక్షుడు నూతి సత్యనారాయణ


