ముగిసిన క్రెడాయ్ ప్రాపర్టీషో
ఖమ్మంమయూరిసెంటర్: ఖమ్మం జిల్లా క్రెడాయ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రాపర్టీ ఎక్స్‌పో ఆదివారంతో ముగిసింది. ఆదివారం క్రెడాయ్ ప్రాపర్టీ షోను ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి, ఎమ్మెల్సీ తాత మధుసూదన్ సందర్శించారు. వినియోగదారుల నమ్మకాన్ని నిర్వాహకులు పొందడంతోనే మూడేళ్లుగా విజయవంతంగా ఎక్స్‌పోను నిర్వహిస్తున్నారని కొనియాడారు. రెండు రోజుల పాటు నగరంలోని ఎస్‌ఆర్‌అండ్‌బీజీఎన్‌ఆర్ కళాశాల మైదానంలో నిర్వహించిన ఈ షోకు నగర ప్రజలతో పాటు హైదరాబాద్, ఖమ్మం చుట్టు పక్కల ప్రాంతాల నుంచి ఆదరణ లభించిందని క్రెడాయ్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు బండి జయకిశోర్ తెలిపారు. కార్యక్రమంలో చెరుకుమల్లి వెంకటేశ్వర్లు, పెద్ది కేశవ్‌రావు, వేములపల్లి నగేశ్, కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు. గంటగంటకూ లక్కీడ్రాలో విజేతలుగా నిలిచిన వారికి నిర్వాహకులు బహుమతులు అందజేశారు.
ఖమ్మంలో ఉమ్మడి జిల్లా డ్రైవర్ల సంఘం సమావేశం
ఖమ్మంసహకారనగర్: ప్రభుత్వ డ్రైవర్ల సంఘం ఉమ్మడి ఖమ్మం జిల్లా కార్యవర్గ సమావేశాన్ని ఆదివారం నగరంలోని సంఘం కార్యాలయంలో నిర్వ హించారు. సమావేశానికి ముఖ్య అతిథిగా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎండీ జహీంగీర్‌అలీ, హౌస్ బిల్డింగ్ సొసైటీ చైర్మన్ ఎండీ సలీం, జిల్లా అధ్యక్షుడు కె.వెంకటేశ్వర్లు హాజరై ప్రసంగించారు. ఉమ్మడి జిల్లా డ్రైవర్‌లకు ప్రతి సంవత్సరం లైఫ్ ఇన్సూరెన్స్ చేయిస్తామన్నారు. ఖమ్మం జిల్లా సంఘానికి వాహ నం కొనుగోలు చేసినందుకు సభ్యులు ఆమోదించారని చెప్పారు. ఇళ్ల స్థలాలు త్వరలోనే వస్తాయని హామీఇచ్చారు. సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి దాసరి వేణుగోపాల్, భద్రా ద్రి కొత్తగూడెం జిల్లా కోకన్వీనర్ రాఘవులు, నాగరాజు, కోటేశ్వరరావు పాల్గొన్నారు.
భద్రాద్రి చిన్నారికి అవార్డు
భద్రాచలంటౌన్: భద్రాచలం పట్టణంలోని యమజాలనగర్ కాలనీకి చెందిన చిన్నారి శ్రీ యాన్వి భగవద్గీత శ్లోకాలను అలవోకగా చెప్పి ‘విశ్వగురు వరల్డ్ రికార్డ్స్’వర్సెస్ బ్లూమ్ అవార్డ్స్ ను దక్కించుకుంది. హైదరాబాద్‌లోని ప్రసాద్ ఫిల్మ్ ల్యాబ్‌లో శనివారం జరిగిన కార్యక్రమంలో ఈ అవార్డు అందించారు. చిన్నారి తల్లి సత్య నాగలక్ష్మి గతంలో భగవద్గీత శ్లోకాలపై శృంగేరిలో నిర్వహించిన పోటీల్లో ప్రథమ బహుమతి సాధించగా.. ఆమెను స్ఫూర్తిగా తీసుకున్న నాలు గేళ్ల శ్రీ యాన్వి గత ఆరు నెలలుగా శ్లోకాలను నేర్చుకుంది. శ్రీయాన్వి భగవద్గీతలోని 50 శ్లోకాలను, దక్షిణామూర్తి స్తోత్రాన్ని, బాల రామాయణంలోని కొన్ని శ్లోకాలను ఏకధాటిగా చెప్పే నైపుణ్యాన్ని గుర్తించిన విశ్వ గురు వరల్డ్ రికార్డ్ సంస్థ చిన్నారికి అవార్డు బహూకరించింది.
ముగిసిన క్రెడాయ్ ప్రాపర్టీషో


