సామాజిక మార్పునకు మార్క్సిజమే మార్గం
ఖమ్మంమయూరిసెంటర్: అనేక రుగ్మతలతో కూడిన ప్రస్తుత దోపిడీ సమాజ మార్పునకు మార్క్సిజమే మార్గమని నమ్మిన వ్యక్తి ఇనుపనూరి జోసఫ్ అని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం అన్నారు. ఆదివారం స్థానిక మంచికంటి భవనంలో బీవీకే జనరల్ మేనేజర్ వై.శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన జోసఫ్ సంస్మరణ సభలో తమ్మినేని మాట్లాడారు. మార్క్సిస్టు సైద్ధాంతిక విషయాలను అధ్యయనం చేయడం, వాటిని నిత్యజీవిత కార్యాచరణకు అన్వయించడంలో జోసఫ్ క్రమశిక్షణ పాటించేవారని కొనియాడారు. వృతి్‌త్ రీత్యా ఉపాధ్యాయుడైనా.. మంచి మార్క్సిస్టు ప్రచారకుడిగా కృషి చేశారని తెలిపారు. ఉద్యోగ విరమణ పొందిన తర్వాత అనేక సామాజిక, సాంస్కృతిక సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్నారని తెలిపారు. బోడేపూడి విజ్ఞాన కేంద్రం మేనేజింగ్ కమిటీ సభ్యులుగా, ఆదివారం మీకోసం కార్యక్రమ నిర్వాహకులుగా సేవలు అందించారని తెలిపారు. ఈ సందర్భంగా జోసెఫ్ కుటుంబసబ్యులకు సానుభూతిని తెలిపారు. సభలో సీపీఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, నాయకులు పి.సోమయ్య, మాచర్ల భారతి, బుగ్గవీటి సరళ, మాదినేని రమేష్, మెరుగు సత్యనారాయణ, బండి పద్మ, బండారు రమేష్, నందిపాటి మనోహర్, ఎస్‌కే మీరా తదితరులు పాల్గొన్నారు.
సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని


