బాల రచయిత్రి చంద్రికకు అంతర్జాతీయ గుర్తింపు
ఖమ్మంగాంధీచౌక్: ఖమ్మం ఎన్నెస్పీ కాలనీ ప్రభుత్వ ఉన్నత పాఠశాల 10వ తరగతి విద్యార్థిని, బాలరచయిత్రిగా రాణిస్తున్న కొల్లి చంద్రికకు అంతర్జాతీయంగా గుర్తింపు లభించింది. ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా) ఆధ్వర్యాన ఈనెల 30న ఆన్‌లైన్‌లో సాహిత్య వేదిక నిర్వహించనున్నారు. ‘బాల సాహిత్య భేరి’ పేరిట 13 గంటల పాటు నిర్వహించే ఈ కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుంచి 101 మంది పాల్గొననుండగా చంద్రికకు అవకాశం దక్కి ంది. ఈ సందర్భంగా ఆమె మూడు నిమిషాల వ్యవధిలో కథ వినిపించనుంది. విద్యార్థిని పాఠశాల హెచ్‌ఎం చావా దుర్గాదేవి, తెలుగు ఉపాధ్యాయుడు కోండ్రు బ్రహ్మం, తదితరులు అభినందించారు.


