జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక
కారేపల్లి: జాతీయ స్థాయి వెయిట్ లిఫ్టింగ్ పోటీలకు కారేపల్లి మోడల్ స్కూల్ విద్యార్థులు ఎంపికయ్యారు. రాష్ట్రస్థాయి ఎస్‌జీఎఫ్ పోటీల్లో పదో తరగతి విద్యార్థిని బి.పల్లవి, ఇంటర్ విద్యార్థి వి.ఉదయ్‌కుమార్ పాల్గొని బంగారు పతకాలు సాధించడంతో మహారాష్ట్రలో జరగనున్న జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక చేశా రు. అలాగే, రాష్ట్ర స్థాయి పోటీల్లో యశస్విని, సాత్విక, అమూల్యప్రియ, నిక్షిత, భరత్ వెండి పతకాలు, విఘ్నేష్ రజత పతకం సాధించారని ప్రిన్సిపాల్ ప్రేమ్‌కుమార్ తెలిపారు. విద్యార్థులను ప్రిన్సిపాల్‌తో పాటుపీఈటీ మూసా మొహినుద్దీన్, అధ్యాపకులు అభినందించారు.
30న కబడ్డీ జట్ల
ఎంపిక పోటీలు
ఖమ్మం స్పోర్ట్స్: జిల్లా స్థాయి పురుషులు, మహిళల కబడ్డీ జట్ల ఎంపిక పోటీలు ఈనెల 30న నిర్వహిస్తున్నట్లు కబడ్డీ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు తుంబురు దయాకర్‌రెడ్డి, కటికల క్రిస్టోఫర్‌బాబు తెలిపారు. ఖమ్మంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో జరిగే పోటీలకు హాజరయ్యే పురుషులైతే 85 కేజీలు, మహిళలు 75 కేజీల బరువు కలిగి ఉండాలని పేర్కొన్నారు. ఆసక్తి ఉన్న వారు ఆధార్‌కార్డుతో హాజరుకావాలని, ఇక్కడ ఎంపిక చేసే జట్లు డిసెంబర్ 11నుంచి కరీంనగర్ జిల్లాలో జరిగే రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీల్లో పాల్గొంటాయని తెలిపారు.
దేవాదాయ కమిషనర్‌ను కలిసిన అధికారులు
ఖమ్మంగాంధీచౌక్: రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ కమిషనర్‌గా ఎస్.హరీష్ ఇటీవల బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా గురువారం ఆయనను హైదరాబాద్‌లో శాఖ ఉమ్మడి ఖమ్మం జిల్లా అసిస్టెంట్ కమిషనర్ ఎం.వీరస్వామి, జమలాపురం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ఈఓ కొత్తూరు జగన్మోహన్‌రావు తదితరులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా కమిషనర్‌ను సత్కరించి స్వామివారి చిత్రపటం, ప్రసాదాలు అందజేశారు.
108 వాహనం తనిఖీ
ఖమ్మంవైద్యవిభాగం: ఖమ్మంలోని 108 వాహనాన్ని జీవీకే, ఈఎంఆర్‌ఐ గ్రీన్ హెల్త్ సర్వీసెస్ క్వాలిటీ కంట్రోల్ ఆడిటింగ్ బృందం గురువారం తనిఖీ చేసింది. అంబులెన్స్‌లోని పరికరాల పనితీరు, నిర్వహణ, మందుల లభ్యత, ఆక్సిజన్ నిల్వలను పరిశీలించడంతో పాటు నెలవారీ కేసుల సగటుపై ఆరా తీశారు. సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ క్షతగాత్రులను గోల్డె న్ అవర్‌లో ఆస్పత్రులకు చేర్చాలని సూచించారు. ఆడిటింగ్ బృందం సభ్యులు ఏ.కిశోర్, ఫయాజ్, ఉమ్మడి జిల్లా ప్రోగ్రామ్ మేనేజర్ పాటి శివకుమార్, జిల్లా మేనేజర్ దుర్గాప్రసాద్, సిబ్బంది జగదీష్, ఖదీర్ పాల్గొన్నారు.
మూడు
ఇసుక ట్రాక్టర్లు సీజ్
ఖమ్మంక్రైం: అనుమతి ఇసుక తరలిస్తున్నట్లు మూడు ట్రాక్టర్లను ఖమ్మం టాస్క్‌ఫోర్స్, త్రీటౌన్ పోలీసులు గురువారం రాత్రి సీజ్ చేశారు. ముదిగొండ మండలం గంధసిరి నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్నట్లు గుర్తించారు. ఈమేరకు ప్రకాష్‌నగర్ వంతెన వద్ద వాహనాలను గుర్తించి స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేసినట్లు సీఐ మోహన్‌బాబు తెలిపారు.
జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక
జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక


