జిల్లాకు ఎన్నికల పరిశీలకుడు
ఖమ్మంసహకారనగర్: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యాన రాష్ట్ర ఎన్నికల కమిషన్ నియమించిన ఎన్నికల సాధారణ పరిశీలకుడు ఖర్తడే కాళీచరణ్ సుదామరావు జిల్లాకు చేరుకున్నారు టీజీ బయో డైవర్సిటీ బోర్డ్ కార్యదర్శిగా ఉన్న ఆయన ఖమ్మం చేరుకోగా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ స్వాగతం పలికి పలు అంశాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో డీపీఓ ఆశాలత తదితరులు పాల్గొన్నారు.
పోలీసుల
విస్తృత తనిఖీలు
ఖమ్మంక్రైం: స్థానిక సంస్థల ఎన్నికలను పురస్కరించుకుని జిల్లా వ్యాప్తంగా పోలీసులు తనిఖీలను ముమ్మరం చేశారు. ఈ సందర్భంగా జిల్లాలోని పలు ప్రాంతాల్లో బుధవారం అర్ధరాత్రి వరకు వాహనాల తనిఖీ చేపట్టగా, అనుమానితుల వివరాలను వేలిముద్రల ఆధారంగా సేకరించారు. అంతేకాక హోటళ్లు, లాడ్జీల్లో ఉన్న వారి పూర్తి వివరాలు తెలుసుకున్నారు. సరిహద్దు రాష్ట్రాల మీదుగా గంజాయి, రేషన్, బియ్యం తరలింపును కట్టడి చేసేలా ఈ తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని పోలీసు కమిషనర్ సునీల్‌దత్ వెల్లడించారు.
‘ఇకపై.. మీరు
స్కూల్‌కు వెళ్లండి’
ఖమ్మం సహకారనగర్: సత్తుపల్లి మండలంలోని పాఠశాల ఉపాధ్యాయుడు జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలోని ఓ విభాగం విధులు కొన్నాళ్లుగా నిర్వర్తిస్తున్నాడు. ఇటీవల డీఈఓ కార్యాలయానికి వచ్చిన ఇంకో ఉపాధ్యాయుడు ఈ విభాగానికి అర్హత సాధించినట్లు తెలిసింది.ఈక్రమాన గురువారం మొదటి ఉపాధ్యాయుడు శాఖ ముఖ్య అధికారి వద్దకు వెళ్లగా ‘ఇక నుంచి మీరు స్కూల్‌కు వెళ్లండి’ అని సూచించినట్లు సమాచారం. అలాగే, డీఈఓ కార్యాలయంలో విధులు నిర్వర్తిస్తున్న ఇంకో ఉద్యోగి తరచూ గైర్హాజరు అవుతుండడంతో ఉన్నతాధికారులకు సరెండర్ చేసినట్లు తెలిసింది.
జిల్లాకు ఎన్నికల పరిశీలకుడు


