మోడల్‌ గ్రామాలకు నజరానా | - | Sakshi
Sakshi News home page

మోడల్‌ గ్రామాలకు నజరానా

Oct 22 2025 7:20 AM | Updated on Oct 22 2025 7:20 AM

మోడల్

మోడల్‌ గ్రామాలకు నజరానా

8లో

న్యూస్‌రీల్‌

పార్టీ విధేయుల చేతికే పగ్గాలు

రెండు పదవులకు 66మంది పోటీ..

ఆరేసి పేర్లతో ప్రతిపాదన..

వచ్చే నెల 15నాటికి ప్రకటన

వ్యక్తి‘గతం’పై ఆరా..

ఉమ్మడి జిల్లాలో అధిక సోలార్‌ ప్లాంట్లు కలిగిన రెండు గ్రామాలకు రూ.కోటి నజరానా ఇచ్చేలా సిఫారసు చేశారు.

బుధవారం శ్రీ 22 శ్రీ అక్టోబర్‌ శ్రీ 2025

అర్హులకే పీఠం!

సాక్షిప్రతినిధి, ఖమ్మం: కాంగ్రెస్‌ జిల్లా, నగర అధ్యక్ష పదవులకు నేతల ఎంపిక చివరి దశకు చేరింది. ఐదు నియోజకవర్గాల నుంచి జిల్లా అధ్యక్ష పదవికి 56 మంది, నగర అధ్యక్ష పదవికి పది మంది దరఖాస్తు చేసుకున్నారు. పార్టీకి విధేయులుగా ఉంటూ ఐదేళ్లుగా పార్టీలో కొనసాగుతూ ఉన్న వారికే పదవులు దక్కుతాయని చెబుతున్నారు. పార్టీని అంటి పెట్టుకుని ఉన్న వారే కాక అసెంబ్లీ ఎన్నికల ముందు పార్టీలో చేరిన వారు కూడా పదవులకు దరఖాస్తు చేసుకున్నారు. దీంతో డీసీసీ పదవికి ఆరుగురు, నగర అధ్యక్ష పదవికి 12 మంది పేర్లతో ఏఐసీసీకి నివేదిక ఇవ్వగా.. వడబోత అనంతరం వచ్చే నెల 15 నాటికి ప్రకటించే అవకాశముంని సమాచారం.

మంత్రులతోనూ చర్చ..

ఏఐసీసీ పరిశీలకుడు మహేంద్రన్‌ను డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్యేలు రాందాస్‌నాయక్‌, మట్టా రాగమయి తదితరులు కలిశారు. ఈక్రమాన వారితోనూ ఏఐసీసీ నిబంధనలు, అధ్యక్ష పదవికి కావాల్సిన అర్హతలపై చర్చించినట్లు తెలిసింది. అన్ని నియోజకవర్గాల నుంచి డీసీసీ అధ్యక్ష పదవికి దరఖాస్తులు రావడంతో పోటీ పెరిగినట్లయింది. 2014 నుంచి 2023 వరకు అధికారంలో లేకపోవడంతో ఆ సమయాన పార్టీలో స్తబ్దత నెలకొంది. ప్రస్తుతం అధికారంలో ఉండడంతో జిల్లా అధ్యక్ష పదవి చేపట్టేందుకు పలువురు ఉత్సాహంగా ఉన్నారు. దీంతో పార్టీకి విధేయులుగా ఉన్న వారికే పదవి ఇవ్వాలని ముఖ్యనేతలు అభిప్రాయపడినట్లు సమాచారం.

బంధువులు కావొద్దు..

జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్ష పదవి కోసం వచ్చిన 56 దరఖాస్తుల్లో ముఖ్య నేతలు ఆరుగురి పేర్లు ఏఐసీసీ పరిశీలనకు వెళ్లాయి. అలాగే నగర కమిటీకి కూడా ఆరుగురి పేర్లు ప్రతిపాదించారు. ఐదేళ్లపాటు నిరంతరాయంగా కాంగ్రెస్‌కు సేవలు అందించిన వారి పేర్లను పరిగణనలోకి తీసుకున్నట్లు చెబుతున్నారు. ఇదేసమయాన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలకు బంధువులు అయి ఉండొద్దనే నిబంధన విధించినట్లు సమాచారం. ఇవికాక పార్టీని ముందుకు నడిపించే సత్తా ఉన్న వారినే పరిగణనలోకి తీసుకుని పార్టీకి విధేయులై సుదీర్ఘకాలం సేవలందిస్తున్న వారికి పదవి ఇస్తేనే న్యాయం చేసినట్లు అవుతుందనే భావన వ్యక్తమవుతోంది.

షార్ట్‌ లిస్ట్‌ చేసి..

డీసీసీ అధ్యక్ష పదవికి 56, ఖమ్మం నగర అధ్యక్ష పదవికి పది దరఖాస్తులు రావడంతో వడబోత అనంతరం ఒక్కో పదవికి ఆరుగురి పేర్లతో మహేంద్రన్‌ జాబితా రూపొందించారు. ఈ జాబితాతో పాటు ఆయా నేతలు నిర్వహించిన పదవులు, ప్రజాక్షేత్రం, పార్టీ కేడర్‌లో ఉన్న అభిప్రాయాలతో ఈనెల 25న ఆయన అధిష్టానానికి సమర్పిస్తారు. అనంతరం రాష్ట్రవ్యాప్తంగా డీసీసీ, నగర అధ్యక్షులను వచ్చేనెల 15లోగా పార్టీ ప్రకటిస్తుందని సమాచారం.

ఆ ఆరుగురు ఎవరో?

డీసీసీ, నగర అధ్యక్ష పదవికి దరఖాస్తు చేసుకున్న నేతలు ఎవరికి వారు పదవి తమకే దక్కుతుందనే ఆశాభావంతో ఉన్నారు. డీసీసీకి దరఖాస్తు చేసుకున్న వారిలో వేమిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, డాక్టర్‌ మట్టా దయానంద్‌, నూతి సత్యనారాయణ, నాగండ్ల దీపక్‌చౌదరి, మద్ది శ్రీనివాస్‌రెడ్డి, సూతకాని జైపాల్‌, కొత్త సీతారాములు, ఎండీ.ముస్తఫా, బెల్లం శ్రీనివాసరావు, పగడాల మంజుల, సూరంపల్లి రామారావు, చోట బాబా తదితరులు ఉన్నారు. అలాగే నగర అధ్యక్ష పదవికి నాగండ్ల దీపక్‌చౌదరి, కమర్తపు మురళి, ఖాదర్‌బాబ, రషీద్‌ తదితరులు దరఖాస్తు చేసుకున్నారు. మొత్తంగా 66దరఖాస్తులు రావడంతో రెండు పదవులకు ఆరుగురి చొప్పున పేర్లను ఏఐసీసీకి ప్రతిపాదించడంతో.. ఎవరి పేర్లు జాబితాలో ఉన్నాయి.. అందులో ఎవరికి పదవి దక్కుతుందనే అంశంపై కాంగ్రెస్‌ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది.

డీసీసీ, నగర అధ్యక్ష పదవులకు ఐదేళ్ల అర్హత

ఏఐసీసీ పరిశీలకులు మహేంద్రన్‌ ఈనెల 11 నుంచి 19 వరకు జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో సమావేశాలు నిర్వహించారు. నియోజకవర్గాల వారీగా ముఖ్య నేతలతో సమావేశమై క్రియాశీలకంగా పని చేస్తున్న నేత ఎవరు.. ఎప్పటి నుంచి పార్టీలో ఉన్నారు.. వారి పనితీరుపై అభిప్రాయాలు సేకరించారు. ఇలా ఐదు నియోజకవర్గాల్లో 3,800 మందితో ముఖాముఖి నిర్వహించగా.. అధ్యక్ష పదవులకు దరఖాస్తు చేసుకున్న వారితో ఈనెల 19న ఖమ్మంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎప్పటి నుంచి పార్టీలో ఉన్నారు.. పదవులు ఇస్తే పార్టీ మరింత బలోపేతానికి ఏం చేస్తారనే ఆరా తీశారు.

మోడల్‌ గ్రామాలకు నజరానా
1
1/1

మోడల్‌ గ్రామాలకు నజరానా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement