
పోస్టల్ బీమా విభాగంలో ఏజెంట్ల నియామకం
ఖమ్మంగాంధీచౌక్: పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్(పీఎల్‌ఐ), రూరల్ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్(ఆర్పీ ఎల్‌ఐ) విభాగాల్లో కమీషన్ పద్ధతిపై తాత్కాలిక ప్రాతిపదికన ఏజెంట్లను నియమించనున్నట్లు ఖమ్మం డివిజన్ పోస్టల్ సూపరింటెండెంట్ వి.వీరభద్రస్వామి తెలిపారు. పదో తరగతి పూర్తిచేసి 18 ఏళ్లు నిండిన నిరుద్యోగులు, గృహిణులు, మాజీ సైనిక ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, గ్రామీణ తపాలా సేవకులు అర్హులని పేర్కొన్నారు. తెలిపారు. ఆసక్తి కలిగిన వారు ఈనెల 27వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు తమ దరఖాస్తులను ‘పోస్టల్ సూపరింటెండెంట్ కార్యాలయం గాంధీచౌక్, ఖమ్మం–507003’ కు చిరునామాకు చేరే పంపించాలని, దరఖాస్తుకు ఎస్సెస్సీ మెమో, ఆధార్, పాన్ కార్డ్ జిరాక్స్ కాపీలను జతపర్చాలని తెలిపారు. ఎంపికై న వారు రూ.500 ఎన్‌ఎస్‌సీ లేదా కేవీపీ రూపంలో డిపాజిట్ చేయాల్సి ఉంటుందని, వివరాలకు సమీపంలోని తపాలా కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు.
అమావాస్య ఎఫెక్ట్ !
● వైన్స్‌కు 13 దరఖాస్తులే నమోదు
ఖమ్మంక్రైం: నూతన ఎకై ్సజ్ పాలసీలో భాగంగా జిల్లాలోని 116 వైన్స్‌కు దరఖాస్తులు ఆహ్వానించిన ప్రభుత్వం, దరఖాస్తు గడువును ఈనెల 23 వరకు పొడిగించింది. అయితే, ఆదివారం, సోమవారం సెలవు కాగా, మంగళవారం అమావాస్య కావడంతో వ్యాపారులు ఆసక్తి చూపలేదు. దీంతో మంగళవారం కేవలం 13దరఖాస్తులే నమోదయ్యాయి. అయితే, బుధవారం నుంచి కార్తీక మాసం ప్రారంభం కానుండడంతో చివరి రెండు రోజులు భారీగా దరఖాస్తులు అందే అవకాశముందని భావిస్తున్నారు. ఇప్పటికే సిండికేట్‌గా మారిన వ్యాపారులు దరఖాస్తుల నమోదుకు సిద్ధమైనట్లు తెలిసింది.
పన్నుల వసూళ్లలో
వేగం పెంచాలి
తల్లాడ: ఆర్థిక సంవత్సరంలో ఆరు నెలలు గడిచిపోయినందున పన్నుల వసూళ్లలో వేగం పెంచాలని జిిల్లా పంచాయతీ ఆశాలత సూచించారు. తల్లాడ మండలంలోని మల్లవరంలో మంగళవారం పర్యటించిన ఆమె రికార్డులు తనిఖీ చేసి పన్నుల డిమాండ్, ఇప్పటివరకు వసూళ్లపై ఆరా తీశారు. ఇకనైనా వసూళ్లలో వేగం పెంచడమే కాక పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. ఆతర్వాత గ్రామంలోని నర్సరీ, సెగ్రిగేషన్ షెడ్, వైకుంఠ ధామాన్ని కూడా డీపీఓ పరిశీలించారు. ఎంపీడీఓ సురేష్‌బాబు, కార్యదర్శి సిద్ధిక్‌మియా, సిబ్బంది పాల్గొన్నారు.
ఆహారంలో
అయోడిన్ అవసరం
ఖమ్మంవైద్యవిభాగం: అయోడిన్ సూక్ష్మపోషకాన్ని ఆహారంలో భాగం చేసుకోవాలని, అయోడిన్ కలిసిన ఉప్పు ఆరోగ్యానికి మంచిదేనని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి బి.కళావతిబాయి తెలిపారు. ‘ప్రపంచ అయోడిన్ లోప నివారణ దినోత్సవం’ సందర్భంగా డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. అయోడిన్ లోపం వల్ల మానసిక మంద గమనం, బలహీనత, అలసట, గర్భిణులకు మృతశిశువులు పుట్టడమే కాక పుట్టిన పిల్లల్లో వైకల్యాలు ఎదురవుతాయని తెలిపారు. మెదడు అభివృద్ధి, మానసిక, శారీరక ఎదుగుదల, రోగనిరోధక శక్తి పెంపునకు అయోడిన్ అవసరమని చెప్పారు. ఈమేరకు అయోడిన్ కలిగిన ఉప్పు వాడాలని, ఆశా కార్యకర్తల వద్ద ఉండే సాల్ట్ టెస్టింగ్ కిట్ల ద్వారా ఉప్పులో అయోడిన్ శాతాన్ని పరీక్షించవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు డీఎంహెచ్‌ఓ వెంకటరమణ, ప్రోగ్రాం ఆఫీసర్లు రామారావు, భాస్కర్‌నాయక్ తదితరులు పాల్గొన్నారు.
గురుకులాల్లో
సమస్యలు పరిష్కరిస్తాం
వైరా: సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో నెలకొన్న సమస్యలు, భవనాల కొరతకు త్వరలోనే పరిష్కార మార్గం చూపిస్తామని పాఠశాలల అసిస్టెంట్ సెక్రటరీ శారద తెలిపారు. వైరాలోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలను మంగళవారం ఆమె తనిఖీ చేశారు. ఈ సందర్భంగా శారద మాట్లాడుతూ వైరా పాఠశాలలో డార్మెటరీ శిథిలావస్థకు చేరగా, డైనింగ్ హాల్ సైతం తాత్కాలికంగా నిర్మించామన్నారు. అలాగే, కోతుల బెడద పరిష్కారంపై దృష్టి సారించామని తెలిపారు. ఇటీవల పాఠశాల ప్రిన్సిపాల్ అనుమతి లేకుండా కొన్ని చెట్లు నరికివేయించారని, కోతుల సమస్యతోనే కొమ్మలు నరికించినట్లు వెల్లడైందని చెప్పారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ మమత, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.