
‘రాంరెడ్డి’తో మృతితో పాతలింగాలలో విషాదం
కామేపల్లి: కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి(73) బుధవారం రాత్రి మృతి చెందా రు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరా బాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. దామోదర్‌రెడ్డి స్వగ్రామం జిల్లాలోని కామేపల్లి మండలం పాతలింగాల. దివంగత రాంరెడ్డి నారాయణరెడ్డి–కమలమ్మ దంపతులకు ఆరో సంతానంగా దామోదర్‌రెడ్డి జన్మించారు. తుంగతుర్తి, సూర్యాపేట నియోజకవర్గాల నుంచి ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన.. మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. ఏళ్లుగా తుంగతుర్తిలో స్థిరపడినా స్వగ్రామమైన పాతలింగాలలో ఏ శుభకార్యం జరిగినా వచ్చేవారు. ఆయన భార్య గతంలోనే మృతి చెందగా, కుమారుడు సర్వోత్తమరెడ్డి ఉన్నారు. కాగా, దామోదర్‌రెడ్డి మృతితో స్వగ్రామమైన పాతలింగాలలో విషాదం నెలకొంది. దామోదర్‌రెడ్డి సోదరుడు రాంరెడ్డి గోపాల్‌రెడ్డి ప్రస్తుతం రాష్ట్ర వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ సభ్యుడిగా కొనసాగుతున్నారు. కాగా, మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి మృతిపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఖమ్మం ఎంపీ రఘురాంరెడ్డి తదితరులు సంతాపం తెలిపారు.
మాజీ మంత్రి దామోదర్‌రెడ్డి కన్నుమూత