
జయ జయహే మహిషాసుర మర్దిని
ఎర్రుపాలెం: తెలంగాణ తిరుపతిగా పేరున్న జమలాపురంలోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా గురువారం ఆలయ యాగశాలలోని అమ్మ వారిని మహిషాసుర మర్దిని రూపంలో అలంకరించగా పెద్దసంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. తొలుత స్వామి వారికి అర్చకులు పంచామృతంతో అభిషేకం నిర్వహించారు. ఆలయ ఈఓ కె.జగన్మోహన్‌రావు, చైర్మన్ ఉప్పల శ్రీరామచంద్రమూర్తి, ప్రధాన అర్చకులు ఉప్పల శ్రీనివాసశర్మ, అర్చకులు ఉప్పల మురళీమోహన్‌శర్మ, రాజీవ్‌శర్మ తదితరులు పాల్గొన్నారు.
ఎన్నికల విధులు
పకడ్బందీగా నిర్వహించాలి
ఖమ్మం సహకారనగర్: స్థానిక సంస్థల ఎన్నికల విధులకు ఎంపికై న ఉద్యోగులు పకడ్బందీగా నిర్వహించాలని మాస్టర్ ట్రైనర్, జిల్లా ఉపాధి కల్పన అధికారి శ్రీరామ్ సూచించారు. ఖమ్మంలోని డీపీఆర్‌సీ భవనంలో బుధవారం నోడల్ అధికారులు, రిటర్నింగ్ అధికారులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మాస్టర్ ట్రైనర్ శ్రీరామ్ మాట్లాడుతూ అధికారులు వారి విధులు, నిబంధనలపై సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. హ్యాండ్ బుక్ ఒకటికి, రెండు సార్లు పరిశీలించాలని సూచించారు. నామినేషన్ల స్వీకరణ, స్క్రూటినీ, ఉపసంహరణ, గుర్తుల కేటాయింపు ప్రక్రియలో జాగ్రత్త వహించాలని ఆయన తెలిపారు.
మొదటి దరఖాస్తు..
ఖమ్మంక్రైం: నూతన ఎకై ్సజ్ పాలసీలో భాగంగా జిల్లాలోని 116 వైన్స్ దుకాణాలకు గాను గత నెల 26వ తేదీ నుండి దరఖాస్తుల స్వీకరణ మొదలైంది. అయితే, ఇన్నాళ్లు ఎవరూ ముందుకు రాకపోగా బుధవారం ఒక దరఖాస్తు నమోదైంది. ఖమ్మం ఎకై ్సజ్‌స్టేషన్–1 పరిధి రఘునాథపాలెంలోని వైన్‌షాప్‌నకు ఈ దరఖాస్తు అందించారు. జిల్లా ఎక్సైజ్ శాఖాధికారి నాగేందర్‌రెడ్డి, సీఐ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.