
వారం నిరీక్షణకు తెర
ఖమ్మంఅర్బన్: ఖమ్మంలోని మున్నేటికి వారం క్రితం కొట్టుకొచ్చిన వ్యక్తి మృతదేహాన్ని బుధవారం ధంసలాపురం వద్ద వెలికితీశారు. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్‌కు చెందిన బందెల వెంకటేశ్వర్లు(43) వాగులో చేపలు పట్టేందుకు వెళ్లి గల్లంతయ్యాడు. నాలుగు రోజుల తర్వాత మృతదేహం ప్రకాష్‌నగర్ చప్టా వద్ద చిక్కుకున్నట్లు త్రీటౌన్ పోలీసులు గుర్తించి గత శనివారం బయటకు తీసేందుకు సిద్ధమైనా వాగు ఉధృతి కారణంగా సాధ్యం కాలేదు. దీంతో అప్పటినుంచి ఆయన కుటుంబ సభ్యులు పడిగాపులు కాస్తున్నారు. కాగా, వరదలో కొట్టుకెళ్తూ బుధవారం ధంసలాపురం సమీపానికి చేరిన మృతదేహం కుళ్లిపోయిన స్థితిలో ఉండగా, ఖమ్మం అర్బన్ పోలీసులు, అన్నం ఫౌండేషన్ చైర్మన్ శ్రీనివాసరావు బయటకు తీశారు. ఆతర్వాత కర్రకు కట్టుకుని పొదల నడుమ శ్రీనివాసరావు, ఆయన బృందం తీసుకురాగా పంచనామా అనంతరం కుటుంబానికి అప్పగించారు.
డోర్నకల్ వాసి మృతదేహం వెలికితీత