
తెగుళ్ల నివారణపై రైతులకు అవగాహన
వైరా: చింతకాని మండలంలోని కొదుమూరులో పలువురు రైతులు సాగుచేసిన వరి, పత్తి పంటలను మధిర వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు మంగళవారం పరిశీలించారు. వరుస వర్షాలతో పంటలను తెగుళ్లు ఆశించిన పరిశీలించిన వారు యాజ మాన్య పద్ధతులపై సూచనలు చేశారు. పత్తిలో వడ తెగులు నివారణకు కాపర్ ఆక్సీక్లోరైడ్ 3 గ్రాములను లీటర్ నీటిలో కలిపి మొక్క మొదళ్ల చుట్టూ పిచికారీ చేయాలని సూచించారు. అలాగే అల్బేరి యా, ఆకుమచ్చ తెగులు, కొమ్మ ఎండు తెగులు, కా యకుళ్లు తెగులు నివారణ చర్యలను వివరించారు. అంతేకాక వరిలో ఆకుల మీద తుప్పు మచ్చలకు జింక్‌లోపం కారణమని నిర్ధారించారు. పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ కె.రుక్మిణీదేవి, వైరా కేవీకే ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ టి.సుచరిత, శాస్త్రవేత్తలు కె.నాగస్వాతి, ఫణిశ్రీ పాల్గొన్నారు.