
అవగాహన సదస్సులో ఏపీఓ జనరల్
భద్రాచలం: హిమాచల్ ప్రదేశ్‌లో జరిగిన నిషేధిత మత్తు పదార్థాలపై అవగాహన సదస్సుకు భద్రాచలం ఐటీడీఏ ఏపీఓ జనరల్ డేవిడ్‌రాజ్ హాజరయ్యారు. శిక్షణ అనంతరం భద్రాచలం వచ్చిన ఆయన మంగళవారం వివరాలు వెల్లడించారు. గిరిజన యువత గంజాయి, డ్రగ్స్, ఇతర మత్తు పదార్థాలకు బానిసలు కాకుండా అవగాహన కల్పించారని, రాష్ట్ర ముఖ్య కార్యనిర్వహణ అధికారి నిఖిల, తెలంగాణ ఇనిస్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్ ప్రతిపాదన మేరకు సదస్సులో పాల్గొన్నట్లు పేర్కొన్నారు. త్వరలో మారుమూల ఆదివాసీ గ్రామాల్లో యువకులకు ప్రత్యేక శిక్షణ అందించేలా ప్రతీ గ్రామంలో అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు.
హిమాచల్‌ప్రదేశ్ వెళ్లివచ్చిన డేవిడ్‌రాజ్