ఖమ్మం సహకారనగర్: వరదల వేళ జిల్లాలో ఎన్‌డీఆర్‌ఎఫ్ సిబ్బంది అందించిన సేవలు అభినందనీయమని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి కొనియాడారు. జిల్లాలో మూడునెలలుగా సేవ లు అందించి తిరిగి హైదరాబాద్ వెళ్తున్న బృందం సభ్యులు కలెక్టర్‌ను మంగళవారం కలిశా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మూడునెలల పాటు బృందం జిల్లా యంత్రాంగానికి అండగా నిలిచిందని, చింతకానిలో వరద సమయాన నదిలో చిక్కుకున్న పలువురి ప్రాణాలను కాపాడారని తెలిపారు. అలాగే, ఆపద మిత్రులకు శిక్షణ ఇచ్చారని చెప్పారు.
ఆలయ ఆర్చి నిర్మాణానికి రూ.1.60 లక్షల వితరణ
కల్లూరు: మండలంలోని పేరువంచలో శ్రీ సీతా రామాంజనేయ స్వామి ఆలయానికి ఎదురుగా ఆర్చి నిర్మానం కోసం అంకిరెడ్డి సుధీర్ కుమార్ జ్ఞాపకార్ధం ఆయన కుటుంబీకులు రూ.1.60లక్షల విరాళం అందజేశారు. ఆయన తల్లిదండ్రులు అంకిరెడ్డి కృష్ణారెడ్డి – వరలక్ష్మి, సోదరుడు నరేష్‌రెడ్డి – స్వప్న ఈ నగదును ఆలయ కమిటీకి అందజేశారు. తాజాగా ఆర్చి నిర్మా ణం పూర్తికావడంతో దాతలను ఆలయ చైర్మన్ వై.రంగారెడ్డి, వైస్ చైర్మన్ కె.శ్రీనివాసరెడ్డి, సభ్యులు కె.సత్యనారాయణరెడ్డి, వనుకూరు ప్రభాకర్‌రెడ్డి, కె.రవీందర్‌రెడ్డి అభినందించారు.
ఉద్యోగ విరమణ పొందిన పోలీస్ అధికారులకు సన్మానం
ఖమ్మంక్రైం: ఉద్యోగ విరమణ చేసిన పోలీసు అధికారులను మంగళవారం పోలీసు కమిషనర్ సునీల్‌దత్ సన్మానించారు. ఖమ్మంలోని కమిషనర్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ సుదీర్ఘ కాలంగా వివి ధ హోదాల్లో ఉద్యోగులు బాధ్యతాయుతంగా సేవలందించారని కొనియాడారు. ఉద్యోగ విరమణ చేసిన వారిలో వైరా ఏసీపీ ఎం.ఏ.రెహమాన్, ఐటీ కోర్ టీమ్ ఎస్సై పి.సత్యనా రాయణ, వీఆర్ ఎస్సై వి.వెంకటేశ్వర్లు, సీఏఆర్ ఆర్‌ఎస్సై ఎండీ.సలీమ్, ఏన్కూరు ఏఎస్సై జి.వెంకటేశ్వర్లు, సీఎస్‌బీ హెడ్ కానిస్టేబుల్ ఎస్‌కే.సయ్యద్ హుస్సేన్, ఖమ్మం సీపీఓ సీని యర్ అసిస్టెంట్ జి.కాంతి ఉన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ రామానుజం, ఆర్ ఐ కామరాజు, పోలీస్ ఉద్యోగుల అసోసియేషన్ ఇన్‌చార్జ్ అధ్యక్షుడు వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
వైరా ఏపీసీకి సన్మానం
వైరా: రెండున్నరేళ్లుగా వైరా ఏసీపీగా విధులు నిర్వర్తిస్తూ ఉద్యోగ విరమణ చేసిన ఎం.ఏ.రెహమాన్ సేవలు మరువలేనివని పలువురు అధికారులు కొనియాడారు. వైరాలో మంగళవారం రెహమాన్ దంపతులను సన్మానించాక అదనపు డీసీపీలు ప్రసాదరావు, రామానుజం మాట్లాడారు. శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేస్తూ పలు కేసుల పరిష్కారంలో కీలకంగా వ్యవహరించారని తెలిపారు. ఏఆర్ అడిషనల్ డీసీపీ కుమారస్వామి, డీసీఆర్‌బీ ఏసీపీ సాంబరాజు, సీసీఎస్ ఏసీపీ సర్వర్ పాషా, సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.
రేషన్ డీలర్ల
బంద్ నిర్ణయం వెనక్కి..
ఖమ్మం సహకారనగర్: కమీషన్ విడుదల చేయాలనే డిమాండ్‌తో రేషన్ డీలర్లు షాప్‌లను బంద్ చేయాలని నిర్ణయించగా ఆ ఆలోచనను విరమించుకున్నారు. ఉన్నతాధికారులు రాష్ట్ర సంఘం బాధ్యులతో చర్చించి సమస్యలు పరి ష్కరిస్తామని హామీ ఇచ్చిన నేపథ్యాన నిరసన, బంద్ ఆలోచన విరమించుకున్నట్లు రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బానోతు వెంకన్న, షేక్ జానీమి యా ఓ ప్రకటనలో తెలిపారు. దీంతో బుధవా రం నుంచి రేషన్ షాప్‌ల ద్వారా బియ్యం పంపిణీ జరగనుంది.
హోటల్ నిర్వాహకులకు రూ.20వేల జరిమానా
ఖమ్మంమయూరిసెంటర్: జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్‌కు వెళ్లే మార్గంలో ఓ ప్రముఖ హోటల్ నిర్వాహకులకు ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు రూ.20వేల జరిమానా విధించారు. హోటల్‌లో మంగళవారం తనిఖీ చేయగా సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ సంచులు వినియోగిస్తున్నట్లు గుర్తించారు. అంతేకాక హోటల్‌లో అపరిశుభ్రంగా ఉండడంతో రూ.20వేల జరిమానా విధించామని కేఎంసీ శానిటరీ సూపర్‌వైజర్ సాంబయ్య తెలిపారు.