
బావిలో పడి వ్యక్తి మృతి
ఖమ్మంక్రైం: ఖమ్మంలోని ఓ దాల్‌మిల్లులో దినసరికూలీగా పనిచేస్తున్న వ్యక్తి మంగళవారం మధ్యాహ్నం ప్రమాదవశాత్తు బావిలో పడగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఏపీలోని ఏలూరు లేదా హనుమాన్ జంక్షన్ పరి సర ప్రాంతాలకు చెందిన 60ఏళ్ల వ్యక్తి పేరు కృష్ణగా తెలుస్తోంది. ఆయనమంగళవారం దాల్‌మిల్లులో కూలీకి వెళ్లగా అక్కడి బావిలో కాలుజారి పడ్డాడు. దీంతో తోటి కూలీలు బయటకు తీసి ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మతదేహన్ని ఖమ్మం ఆస్పత్రి మార్చురీలో భద్రపర్చగా, ఆయన ఆచూకీ తెలిసిన వారు తమను సంప్రదించాలని ఖమ్మం త్రీటౌన్ పోలీసులు సూచించారు.
విద్యుదాఘాతంతో వ్యక్తి ..
కామేపల్లి: ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురైన వ్యక్తి మృతిచెందాడు. మండలంలోనిని గరిడేపల్లికి చెందిన మాలోత్ నవీన్(25) ఇంటి చుట్టూ రేకులతో వేసిన ఇంట్లో నివాసం ఉంటున్నాడు. ఈక్రమాన సోమవారం రాత్రి ఫ్యాన్ కు అమర్చిన కరెంట్ వైరు తెగి రేకులకు తాకింది. ఆపై నవీన్ ప్రమాదవశాత్తు రేకులను తాకడంతో షాక్‌కు గురై అక్కడికక్కడే మృతిచెందాడు. ఆయన భార్య నందిని ఫిర్యాదుతో మంగళవారం పోలీసులు కేసు నమోదు చేశారు.
ట్రాక్టర్ కిందపడి యువకుడు..
నేలకొండపల్లి: రెండు బైక్‌లు ఢీకొనగా కింద పడిన వ్యక్తి పైనుంచి ట్రాక్టర్ వెళ్లడంతో అక్కడిక్కడే మృతి చెందిన ఘటన ఇది. మండలంలోని కోనాయిగూడెంకు చెందిన సుతారీ మేసీ్త్ర కొచ్చేర్ల బాలకృష్ణ(35) రోజుమాదిరిగానే మంగళవా రం పనికి వెళ్లి రాత్రి ఇంటికి బైక్‌పై వస్తున్నాడు. రాజేశ్వరపురం సాగర్ కాల్వ సమీపాన నేలకొండపల్లి నుంచి కూసుమంచి వెళ్తున్న మరో బైక్ ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో బాలకృష్ణ రోడ్డుపై పడగా వెనక నుంచి వచ్చిన ట్రాక్టర్ ఆయన పైనుంచి వెళ్లడంతో అక్కడిక్కిడే మృతి చెందాడు. ఈ ప్రమాదంలో మరో బైక్‌పై ఉన్న వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.
17 ఏళ్ల బాలుడు అదృశ్యం
ఖమ్మంఅర్బన్: ఖమ్మం 7వ డివిజన్ టేకులపల్లికి చెందిన 17ఏళ్ల బాలుడు కానరాకుండా పోయాడు. టేకులపల్లికి చెందిన బొడ్డు రామకృష్ణ కుమారుడు భవానీప్రసాద్ సోమవారం మధ్యాహ్నం ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. ఎక్కడ వెతికినా ఆచూకీ లేకపోవడంతో ఆయన తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఖమ్మం అర్బన్ సీఐ భానుప్రకాశ్ తెలిపారు.