
స్థానిక ఎన్నికల సమరానికి సిద్ధం కండి
ఖమ్మంమయూరిసెంటర్/రఘునాథపాలెం: స్థానిక ఎన్నికల సమరానికి పార్టీ శ్రేణులు సిద్ధం కావాలని సీపీఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు సూచించారు. ఖమ్మంలోని సుందరయ్య భవనంలో పార్టీ ఖమ్మం డివిజన్ రఘునాథపాలెం మండల ముఖ్య నాయకులు, పాలేరు డివిజన్ కమిటీ నాయకులతో మంగళవాం ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా నాగేశ్వరరావు మాట్లాడుతూ స్థానిక ఎన్నికల్లో ప్రజలకు దగ్గరకు ఉండే వారికే విజయం దక్కనున్నందున పార్టీ శ్రేణులు ప్రజాక్షేత్రంలోకి వెళ్లి వారి సమస్యల పరిష్కారానికి పాటుపడాలని తెలిపారు. ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా సీపీఎం అనేక పోరాటాలు నిర్వహించిందని చెప్పారు. ఈనేపథ్యాన సీపీఎం అభ్యర్థులకు ప్రజల మద్దతు కచ్చితంగా లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సమావేశాల్లో ఖమ్మం, పాలేరు డివిజన్లు, రఘునాథపాలెం మండల కార్యదర్శి వై.విక్రమ్, బండి రమేష్, ఎస్.నవీన్‌రెడ్డి, నాయకులు సభ్యురాలు బుగ్గవీటి సరళ, బొంతు రాంబాబు, ఎస్.నవీన్‌రెడ్డి, మహమ్మద్ జబ్బార్, బానోతు నాగేశ్వరరావు, నాగయ్య, షేక్ ఇమామ్, గుగలోత్ కుమార్, కూచిపూడి నరేష్ పాల్గొన్నారు.
సీపీఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు