
గురుకుల నిర్మాణం త్వరగా పూర్తిచేయాలి
బోనకల్: మండలంలోని లక్ష్మీపురంలో యంగ్ ఇండియా సమీకృత గురుకుల పాఠశాల భవన నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. నిర్మాణ పనులను మంగళవారం ఆయన పరిశీలించిన ఆయన మ్యాప్ ఆధారంగా వివరాలు సేకరించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ అద్భుతమైన మేధస్సుతో కూడిన మానవ వనరులను అందించడమే యంగ్ ఇండియా సమీకృత గురుకుల పాఠశాలల లక్ష్యమన్నారు. గ్రామీణ విద్యార్థులకు అత్యున్నత విద్యనందించనున్న గురుకుల భవన నిర్మాణంలో రాజీ పడకుండా పూర్తిచేయాలని సూచించారు. తరగతి, వసతి గదులతో పాటు ఉపాధ్యాయులు, సిబ్బంది క్వార్టర్లు మార్చిలోగా పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ ఈఈ బుగ్గయ్య, తహసీల్దార్ రమాదేవి తదితరులు పాల్గొన్నారు.
అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి