
‘చాంబర్’ ఎన్నికలకు సమాయత్తం
ఖమ్మంగాంధీచౌక్: ఖమ్మం చాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికలకు సమయం ఆసన్నమైంది. ఆఫీస్ బేరర్లు, 19 వ్యాపార శాఖల విభాగాల ప్రతినిధులను మూడేళ్లకోసారి ఎన్నుకుంటారు. ఈమేరకు వ్యాపారులు ప్యానెళ్లుగా ఏర్పడి బరిలో నిలుస్తారు. ఈసారి అధ్యక్షుడిగా కురువెళ్ల ప్రవీణ్‌కుమార్, ప్రధాన కార్యదర్శిగా గొడవర్తి శ్రీనివాసరావు, ఉపాధ్యక్షుడిగా కురువెళ్ల కాంతారావు, సహాయ కార్యదర్శిగా బాదె రమేష్, కోశాధికారిగా తూములూరి లక్ష్మీనరసింహారావు పోటీ చేసేలా మరికొందరితో ప్యానల్ ఏర్పాటైంది. ఈ ప్యానల్ బాధ్యులు సోమవారం ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో వ్యాపారులను కలిసి తమను గెలిపించాలని అభ్యర్థిచారు. వీరికి మద్దతుగా పత్తిపాక రమేష్, పొలవరపు కోటేశ్వరరావు, మాటేటి రాకేష్, చిలకల ఆదినారాయణ, వడ్డే వెంకటేశ్వర్లు, సోమవరపు సుదీర్‌కుమార్, ప్రభాకర్, బజ్జూరి రమణా రెడ్డి, బండి సతీష్ సిరికొండ వెంకటేశ్వర్లు, గుడిపూడి నరిసింహారావు ప్రచారంలో పాల్గొన్నారు.