
ప్రజావాణి దరఖాస్తులకు ప్రాధాన్యత
ఖమ్మం సహకారనగర్: ప్రజావాణిలో ప్రజలు ఇచ్చే ప్రతీ ఫిర్యాదును పరిశీలించి సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఆదేశించారు. కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో అదనపు కలెక్టర్లు పి.శ్రీజ, పి.శ్రీనివాసరెడ్డితో కలిసి ఆయన ఫిర్యాదులు, వినతిపత్రాలు స్వీకరించారు. అనంతరం అధికారులతో సమావేశమై దరఖాస్తుల పరిష్కారంపై సూచనలు చేశారు.
సోలార్ విద్యుత్‌తో ప్రయోజకరం
ఖమ్మంవ్యవసాయం: సోలార్ విద్యుత్‌తో అనేక ప్రయోజనాలు ఉన్నందున అర్హత కలిగిన గృహ వినియోగదారులు ఏర్పాటుచేసుకునేలా అవగాహ న కల్పించాలని కలెక్టర్ అనుదీప్ ఆదేశించారు. కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డితో కలిసి సోమవారం ఆయన అధికారులతో ‘పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన’పై సమీక్షించారు. తొలుత పథకం విధివిధానాలను ఎన్పీడీసీఎల్ ఎస్‌ఈ శ్రీనివాసాచారి వెల్లడించాక కలెక్టర్ మాట్లాడుతూ ఎక్కువ మంది సోలర్ విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుచేసుకునేలా అవగాహన కల్పించాలని చెప్పారు. తద్వారా పర్యావరణ పరిరక్షణ సాధ్యమవుతుందని తెలిపారు. పూర్తిసమాచారం కోసం ఎన్పీడీసీఎల్ హెల్ప్‌లైన్ 1912 లేదా ఏఈ / డీఈ కార్యాలయాల్లో సంప్రదించేలా ప్రచారం చేయాలని సూచించారు. ఈసమావేశాల్లో డీఆర్వో పద్మశ్రీ, జెడ్పీ సీఈఓ దీక్షారైనా తదితరులు పాల్గొన్నారు.
సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతిరూపం
ఖమ్మంమయూరిసెంటర్: సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతిరూపంగా బతుకమ్మ పండుగ నిలుస్తోందని.. ప్రకృతిని అమ్మగా కొలిచే ఈ పండుగకు ఎంతో ప్రాధాన్యత ఉందని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. ఖమ్మం పెవిలియన్ మైదానంలో నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో కలెక్టర్ దంపతులు పాల్గొన్నారు. గౌరమ్మ తల్లికి పసుపు, కుంకుమతో పూజించిన వారు మహిళలతో కలిసి బతుకమ్మ ఆడి ఉత్తేజపరిచారు. డీఆర్డీఓ సన్యాసయ్య, వివిధ శాఖ ల అధికారులు, మహిళా ఉద్యోగులు, స్వయం సహాయక సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

ప్రజావాణి దరఖాస్తులకు ప్రాధాన్యత