
ఎకై ్సజ్ ఎస్సైగా ఎంపికై న కానిస్టేబుల్
వైరారూరల్: వైరా మండలం గన్నవరం గ్రామానికి చెందిన కారుమంచి విజయ్ గ్రూప్–2 ఫలితాల్లో ఎకై ్సజ్ ఎస్సైగా ఎంపికయ్యాడు. ఆయన బీటెక్ పూర్తిచేశాక 2012లో రైల్వే ట్రాక్‌మెన్‌గా, 2014లో ఎకై ్సజ్ కానిస్టేబుల్ ఉద్యోగం సాధించి సత్తుపల్లిలో ఉద్యోగం చేస్తున్నాడు. అయినా పట్టువీడక పరీక్షలకు సిద్ధమవడంతో గ్రూప్–2 ఫలితాల్లో ఎకై ్సజ్ ఎస్సైగా ఎంపికయ్యాడు. విజయ్ తల్లిదండ్రులు కారుమంచి జయరావు, ఎలిశ మ్మ వ్యవసాయ కూలీలుగా జీవనం సాగిస్తూ చదివించారు.
5న సీపీఐ శత వసంతాల సభ సన్నాహాక సమావేశం
ఖమ్మంమయూరిసెంటర్: సీపీఐశత వసంతాల ముగింపు సభ డిసెంబర్‌లో ఖమ్మంలో జరగనుండగా, నేపథ్యాన అక్టోబర్ 5న సన్నాహక సమావేశం ఏర్పాటుచేసినట్లు భద్రాద్రి, ఖమ్మం జిల్లాల కార్యదర్శులు ఎస్.కే.సాబీర్ పాషా, దండి సురేష్ తెలిపారు. ఖమ్మం ఎస్ ఆర్ గార్డెన్స్‌లో పార్టీ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అధ్యక్షతన జరిగే సమావేశంలో జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా, బినాయ్ విశ్వం, కె.నారాయణ, అజీజ్ పాషా, పువ్వాడ నాగేశ్వరరావు, చాడ వెంకటరెడ్డి హాజ రవుతారని వెల్లడించారు. అలాగే, ఆహ్వాన సంఘ సమావేశానికి తెలంగాణతో పాటు వివిధ ఇతర రాష్ట్రాల నేతలు పల్లా వెంకటరెడ్డి, కె. రామకృష్ణ, ఎం.వీరపాండ్యన్, మహ్మద్ సలీం, సుందరేష్, పర్ష పద్మ, శ్రీనివాస్, ఈటి నర్సింహా, బాగం హేమంతరావు తదితరులు కూడా పాల్గొంటారని తెలిపారు.
డీలర్ల సమస్యలు పరిష్కరించాలి
ఖమ్మం సహకారనగర్: రేషన్ డీలర్ల పెండింగ్ సమస్యలన్నీ పరిష్కరించాలని సంఘం బాధ్యులు కోరారు. కలెక్టరేట్ వద్ద ధర్నాచౌక్‌లో జిల్లా రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం ఆధ్వర్యాన సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం బాధ్యులు మాట్లాడుతూ తమ కు నెలలుగా పెండింగ్ ఉన్న కమీషన్ విడుదల చేయడమే ఇతర సమస్యలు పరిష్కరించాలన్నారు. ధర్నాకు వైరా మాజీ ఎమ్మెల్యే చంద్రావతి సంఘీభావం తెలిపి మాట్లాడుతూ డీలర్ల సమస్యలు పరిష్కారమయ్యే వరకు అండగా నిలుస్తామని తెలిపారు. అనంతరం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టికి వినతిపత్రం అందజేశారు. డీలర్ల సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు బానోతు వెంకన్న, షేక్ జానీమియాతో పాటు దుర్గయ్య, మౌలానా తదితరులు పాల్గొన్నారు.

ఎకై ్సజ్ ఎస్సైగా ఎంపికై న కానిస్టేబుల్