
మహాచండీ అలంకరణలో అమ్మవారు
జమలాపురంలో కొనసాగుతున్న
శ్రీ దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు
ఎర్రుపాలెం: తెలంగాణా తిరుపతిగా ప్రసిద్ధి గాంచిన జమలాపురం శ్రీవేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో శ్రీదేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవోపేతంగా సాగుతున్నాయి. ఈ కమ్రంలో అమ్మవారు ఆదివారం మహాచండీ అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. అర్చకులు తెల్లవారుజామున శ్రీవారికి పంచామృతాభిషేకం చేశారు. ఆ తర్వాత సౌరసూక్త హోమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. భక్తులకు అన్నదానం చేశారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ కె.జగన్మోహన్‌రావు, చైర్మన్ ఉప్పల శ్రీరామచంద్రమూర్తి, ప్రధానార్చకులు ఉప్పల శ్రీనివాసశర్మ, అర్చకులు ఉప్పల మురళీమోహన్ శర్మ, రాజీవ్‌శర్మ తదితరులు పాల్గొన్నారు.
జిల్లాలో నేడు మంత్రి
పొంగులేటి పర్యటన
ఖమ్మంమయూరిసెంటర్/నేలకొండపల్లి : రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోమవారం జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 10.10 గంటలకు నేలకొండపల్లి మండలం అమ్మగూడెంలో బీటీ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తారు. 10.40 గంటలకు కొరట్లగూడెంలో పర్యటించనున్నారు. 11.10 గంటలకు కోనాయిగూడెం, 11.40 గంటలకు నేలకొండపల్లిలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. మధ్యాహ్నం తర్వాత ఖమ్మం, పాలేరు నియోజకవర్గాల్లో ఏర్పాటు చేసిన పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు.
పామాయిల్ ఫ్యాక్టరీ పనుల పరిశీలన
వేంసూరు : మండల పరిధిలోని కల్లూరుగూడెంలో నిర్మిస్తున్న పామాయిల్ ప్యాక్టరీ పనులను ఆయిల్‌ఫెడ్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఫ్యాకర్టీ నిర్మాణ పనులు త్వరతిగతిన పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో జీఎం సుధాకర్ రెడ్డి, ప్రాజెక్ట్ మేనేజర్ శ్రీకాంత్, మేనేజర్ నాగబాబు పాల్గొన్నారు.