
నవ్వించిన ‘ఆనందో బ్రహ్మ’
ఖమ్మంగాంధీచౌక్: నగరంలోని భక్త రామదాసు కళాక్షేత్రంలో ఆదివారం రాత్రి మొగిలి ఎంటర్‌టైన్‌మెంట్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘ఆనందో బ్రహ్మ’కార్యక్రమాలు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాయి. హాస్యనటులు(జబర్దస్త్) అప్పారావు, గడ్డం నవీన్, మోహన్ ప్రేక్షకులను నవ్వించారు. డ్రామా జూనియర్స్ వండర్ కిడ్ గుణసాయి తన స్కిట్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. తడాఖా విన్నర్ బాబాషరీఫ్ మిమిక్రీ, ఇంద్రజాలకుడు కేవీ చారీ ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఫైర్ డ్యాన్సర్ ఈశ్వర్ బహదూర్, కమెడియన్ జల్లేపల్లి రమేశ్, మిమిక్రీ సుధాకర్ అభినయం ప్రేక్షకుల మెప్పుపొందింది. బేబీ సుప్రజాదేవి భరతనాట్యం, సంతోష్ అకాడమీ నృత్యాలు అలరించాయి. పంజా మాలతి, ఎస్వీ రమణ, శేఖర్ బాబు, ఎస్.ప్రకాష్, సత్యానందం, గణపతిరాజు పాడిన పాటలు ఉర్రూతలూగించాయి. కార్యక్రమానికి తొలుత నటులు, రచయిత ఎన్.కాంతేశ్వరరావు, మొగిలి ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత మొగిలి గుణకర్ జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం జరిగిన సభకు న్యాయవాది జల్లా లక్ష్మీనారాయణ అధ్యక్షత వహించగా, మిత్రా గ్రూప్స్ చైర్మన్ కురువెళ్ల ప్రవీణ్‌కుమార్, హార్వెస్ట్ విద్యాసస్థల ప్రతినిధి పార్వతిరెడ్డి, మార్కెటింగ్ శాఖ అధికారి రుద్రాక్షల మల్లేశం, డాక్టర్ కాపా మురళీకృష్ణ తదితరులు మాట్లాడుతూ.. ‘ఆనందో బ్రహ్మ’వంటి కామెడీ కార్యక్రమాలను మొగిలి ఎంటర్‌టైన్ మెంట్స్ సంస్థ నిర్వహించటం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో వైద్యులు జగదీశ్, నర్సింహారావు, కమర్తపు శ్రీధర్, కొత్తపల్లి శేషు, మద్దెల శివకుమార్, నాగసాయి, విద్యాసాగర్, రవితోష్, రామారావు తదితరులు పాల్గొన్నారు.

నవ్వించిన ‘ఆనందో బ్రహ్మ’