
ములుగు డిప్యూటీ కలెక్టర్‌గా కాకరవాయి వాసి
తిరుమలాయపాలెం: మండలంలోని కాకరవాయి గ్రామానికి చెందిన కొత్తపల్లి ఖుషీల్‌వంశీ శనివారం రాత్రి హైదరాబాద్ శిల్పకళావేదికలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా డిప్యూటీ కలెక్టర్‌గా ని యామకపత్రం అందుకోగా వెంటనే పోస్టింగ్ ఇచ్చా రు. ములుగు జిల్లా డిప్యూటీ కలెక్టర్‌గా నియమితులైన ఆయన సోమవారం బాధ్యతలు స్వీకరించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కాకరవాయి గ్రామానికి చెందిన కొత్తపల్లి శివకుమార్, రేణుక దంపతుల కుమారుడు ఖుషీల్‌వంశీ ఇప్పటికే నాలు గు కేంద్ర, రాష్ట్ర ఉద్యోగాలు సాధించగా గ్రూప్–1 ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో 63వ ర్యాంకు, రిజర్వేషన్ కేటగిరిలో 3వర్యాంకు సాధించాడు. ఆయన్ను గ్రామస్తులు, అధికారులు అభినందించారు.
ఎంపీఓగా పడాల రమేష్..
తల్లాడ: మండడలంలోని బాలపేటకు చెందిన పడాల రమేష్ బాబు గ్రూప్–2లో ప్రతిభ సాధించి ఎంపీఓగా ఎంపికయ్యారు. ఈ మేరకు ఆదివారం ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందాయి. తన తండ్రి చిన్నప్పుడే మృతి చెందగా.. తల్లి, కుటుంబసభ్యుల ప్రోత్సాహంతోనే ఈ ఉద్యోగం సాధించానని రమేష్ తెలిపారు.
కో ఆపరేటివ్ ఆసిస్టెంట్ రిజిస్ట్రార్‌గా..
తల్లాడ మండలం మల్లవరం గ్రామానికి చెందిన దుగ్గిదేవర వెంకటేశ్వరరావు గ్రూప్–2లో ప్రతభ కనబర్చి కో ఆపరేటివ్ అసిస్టెంట్ రిజిస్ట్రార్‌గా ఎంపికయ్యారు. తండ్రి కాళేశ్వర్‌రావు చిన్నతనంలోనే చనిపోగా తల్లి రుక్మిణి ప్రోత్సాహంతో కష్టపడి చదివి ఈ కొలువు సాధించానని చెప్పారు. కాగా, ఆయనకు 2018లో పంచాయతీ కార్యదర్శిగా, 2019లో అటవీశాఖలో బీట్ ఆఫీసర్‌గా, 2020లో విద్యుత్‌శాఖలో జేఏఓగా ఉద్యోగాలు కూడా రావడం విశేషం. కాగా, నారాయణపురం గ్రామానికి చెందిన రెడ్డెం రామకోటారెడ్డి ఎంపీఓగా, పినపాకకు చెందిన ఎక్కిరాల ప్రశాంత్ కో ఆపరేటివ్ అసిస్టెంట్ రిజిస్ట్రార్‌గా ఎంపికయ్యారు.
ఆటోవాలా కుమారుడు ఎంపీడీఓ..
కల్లూరు: మండలంలోని చెన్నూరు గ్రామానికి చెందిన కంచెపోగు వంశీకృష్ణ గ్రూప్–1లో ప్రతిభ కనబర్చి ఎంపీడీఓ ఉద్యోగం సాధించగా.. సీఎం రేవంత్‌రెడ్డి చేతులమీదుగా నియామకపత్రం అందుకున్నారు. ఆయన తండ్రి రాములు ఆటో డ్రైవర్ కాగా, తల్లి సుశీల వ్యవసాయ కూలీ. తన చదువుకు తల్లిదండ్రులతో పాటు సోదరుడు నాగరాజు ప్రోత్సాహం, సహాయం దోహద పడ్డాయని వంశీకృష్ణ తెలిపారు.

ములుగు డిప్యూటీ కలెక్టర్‌గా కాకరవాయి వాసి