
22 కేజీల గంజాయి పట్టివేత
మధిర: అంబారుపేట చెరువుగట్టు సమీపంలో ఆదివా రం ఎకై ్సజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ పోలీసులు 22 కేజీల ఎండు గంజాయిని పట్టుకున్నారు. ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్ జనార్దన్‌రెడ్డి, అసిస్టెంట్ కమిషనర్ గణేశ్, ఏఈఎస్‌కే తిరుపతి ఆదేశాల మేరకు ఎకై ్సజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఎస్‌ఐ సీహెచ్ శ్రీహరిరావు, సిబ్బంది కలిసి అంబారుపేట చెరువు కట్ట సమీపంలో తనిఖీలు నిర్వహించారు. అనుమానాస్పదంగా కనిపించిన సిమెంట్ రంగు సూట్ కేసును పరిశీలించి చూడగా అందులో 22 కేజీల ఎండు గంజాయి లభించింది. పరిసరాల్లో గాలించగా ఎవరూ కనిపించలేదు. విచారణ నిమిత్తం గంజాయిని మధిర ఎకై ్సజ్ స్టేషన్‌లో అప్పగించారు. తనిఖీల్లో ఎకై ్సజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ సిబ్బంది కరీం, బాలు, సుధీర్, వెంకట్, హనుమంతరావు, వీరబాబు, స్వరూప, ఉపేందర్ పాల్గొన్నారు.
వ్యక్తి ఆత్మహత్య
ఖమ్మంఅర్బన్: నగరంలోని కై కొండాయిగూడెంనకు చెందిన గ్రానైట్ కార్మికుడు గొర్రెపాటి వెంకటేశ్వర్లు (48) ఆర్థిక సమస్యలతో పురుగుమందు తాగి ఆత్మహత్య కు పాల్పడిన ఘటనపై ఖమ్మంఅర్బన్ (ఖానాపురంహవేలి) పోలీస్ స్టేషన్లో ఆదివా రం కేసు నమోదైంది. సీఐ భానుప్రకాశ్ కథనం ప్రకారం.. గొర్రెపాటి వెంకటేశ్వర్లు గ్రానైట్ కార్మికుడిగా పనిచేస్తున్నాడు. ఆర్థికసమస్యలతో ఇబ్బంది పడుతున్న ఆయ నఆదివారం ఉదయం పురుగులమందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించగా చికిత్సపొందుతూ మృతిచెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఓ కుమార్తె వివాహమైంది. మృతుడి సోదరుడు చంద్రశేఖర్ ఫిర్యాదు మేరకు కేసు విచారణ చేపట్టినట్లు సీఐ వివరించారు.