
బతుకమ్మా.. బతుకు ఇవ్వమ్మా...
ఖమ్మంవైద్యవిభాగం: బతుకమ్మ అంటే పూల పండుగే కాదు.. బతుకుకు భరోసా ఇస్తుందనే ఆశ, విశ్వాసం. ఆ నమ్మకంతోనేమో తలసేమియాతో బాధపడుతున్న చిన్నారులతో ఖమ్మంలోని సంకల్ప వలంటరీ ఆర్గనైజేషన్ కార్యాలయం వద్ద శనివారం బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. ఈక్రమాన తమకోసం నెలనెలా రక్తదానం చేస్తున్న వారిని కాపాడాలని, తమ ఆయుష్షు పెంచాలని వేడుకున్నారు. డాక్టర్ డి.నారాయణమూర్తి, డాక్టర్ డి.వెంకట్, సంస్థ ఫౌండర్ అనిత, వ్యవస్థాపక అధ్యక్షురాలు ప్రొద్దుటూరి చంద్రలీల, బాధ్యులు పొద్దుటూరి పావని, పి.రవిచందర్, పి.ఉదయ్ భాస్కర్, నెల్లూరి ఉపేందర్, అనిత, జాన్సన్ కిడ్స్ స్కూల్ కరస్పాండెంట్ మమత, అనురాధ పాల్గొన్నారు.
తలసేమియా చిన్నారులతో ఆటపాట