
ఉరి వేసుకుని యువకుడి ఆత్మహత్య
చింతకాని: మండలంలోని పందిళ్లపల్లికి చెందిన మొగిలి నవీన్(22) శనివారం ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయిన ఆయన తల్లితో కలిసి ఉంటున్నాడు. ఇటీవల మద్యానికి బానిసైన నవీన్ తరచూ తల్లితో గొడవ పడుతుండడంతో ఆమె నాలుగు రోజుల క్రితం తల్లిగారింటికి ఏపీలోని వత్సవాయి మండలం డబ్బాకుపల్లి వెళ్లింది. తిరిగి శనివారం పందిళ్లపల్లి వచ్చేసరికి నవీన్ ఇంట్లో చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆమె ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై వీరేందర్ తెలిపారు.
200 కేజీల గంజాయి దహనం
ఖమ్మంక్రైం: వివిధ కేసుల్లో పట్టుబడిన గంజాయిని శనివారం శాసీ్త్ర య పద్ధతిలో దహనం చేశారు. కమిషనరేట్‌లోని వివిధ పోలీస్‌స్టేషన్ల పరిధిలో సీజ్‌చేసిన 200 కిలోల గంజాయిని అడిషనల్ డీసీపీ ప్రసాద్‌రావు పర్యవేక్షణలో తల్లాడ మండలం గోపాల్‌పేటలోని ఏడబ్ల్యూఎం కన్సల్టెన్సీ లిమిటెడ్‌లో దహనం చేయించారు. ఈ కార్యక్రమంలో టాస్క్‌ఫోర్స్ ఏసీపీ సత్యనారాయణ, సీసీఆర్ బీ సీఐ స్వామి తదితరులు పాల్గొన్నారు.