
ఒకే ఈతలో రెండు దూడలు జననం
పెనుబల్లి: పెనుబల్లి మండలంలోని ఓ రైతుకు చెందిన గేదె ఒకే ఈతలో రెండు దూడలకు జన్మనిచ్చింది. యడ్లబంజరు గ్రామానికి చెందిన రైతులు సుంకర సత్యనారాయణ –వెంకట నర్సమ్మ ఐదేళ్లుగా పాడిగేదెను పెంచుతున్నా రు. ఈ గేదె శుక్రవారం రాత్రి రెండు దూడలను జన్మినవ్వగా, రెండూ ఆరోగ్యంగా ఉన్నాయి.
ఉషూ పోటీల్లో
క్రీడాకారులకు పతకాలు
ఖమ్మంస్పోర్ట్స్: మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురులో ఇటీవల స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యాన నిర్వహించిన 69వ రాష్ట్రస్థాయి ఉషూ పోటీల్లో జిల్లా క్రీడాకారులు పతకాలు సాధించారు. 60 కేజీల విభాగంలో ఫిర్‌దోస్ బంగారు పతకం అందుకోగా, 48 కేజీల విభా గంలో ఉమర్‌ఫారూక్ వెండి పతకం, 40 కేజీల విభాగంలో ఆర్యన్, సంజన, 36 కేజీల విభాగంలో చైత్రవర్షిణి రజత పతకాలు గెలుచుకున్నారని కోచ్ పి.పరిపూర్ణాచారి తెలిపారు. క్రీడాకారులను డీవైఎస్‌ఓ టి.సునీల్‌రెడ్డి, ఎస్‌జీఎఫ్ కార్యదర్శి పూనాటి వెంకటేశ్వర్లు అభినందించారు.
డీపీఓగా గోవిందాపురం యువతి
బోనకల్: మండలంలోని గోవిందాపురం(ఏ) గ్రామానికి చెంది న భాగం రాము – గీతాదేవి దంపతుల కుమార్తె నిఖిల ఇటీవల వెల్లడైన గ్రూప్–1 ఫలితాల్లో డీపీఓ ఉద్యో గం సాధించింది. రాము కుటుంబం వ్యాపారరీత్యా విజయవాడలో స్థిరపడింది. దూరవిద్య ద్వారా ఎంఏ సోషియాలజీ పూర్తిచేసిన నిఖిల గ్రూప్–1లో రాష్ట్ర స్థాయిలో 92వ ర్యాంకు సాధించగా డీపీఓగా ఎంపికవడంపై గ్రామస్తులు అభినందించారు.
అక్రమంగా రవాణా చేస్తున్న పశువులు స్వాధీనం
ఖమ్మంక్రైం: ఎలాంటి అనుమతి లేకుండా మినీ వ్యాన్లలో సామర్థ్యనికి మించి పశువులను రవాణా చేస్తుండగా స్వాధీనం చేసుకున్నామని ఖమ్మం త్రీటౌన్ సీఐ మోహన్‌బాబు తెలిపారు. ప్రకాష్ నగర్ బ్రిడ్జి వద్ద తనిఖీ చేస్తుండగా సుజాత్‌నగర్ నుంచి మూడు మినీ వ్యాన్లలో 10 ఆవులు, ఐదు పెయ్యదూడలు, ఆరు కోడె దూడలు కలిపి 21 జీవాలను కోదాడకు తరలిస్తున్నట్లు గుర్తించామని పేర్కొన్నారు. ఈమేరకు బాధ్యులను అదుపులోకి తీసుకుని పశువులను టేకులపల్లిలోని గోశాలకు తరలించినట్లు సీఐ తెలిపారు.
మున్నేటిలో మృతదేహం
ఖమ్మంక్రైం: ఖమ్మం ప్రకాష్ నగర్‌లోని మున్నేటి వద్ద గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని శనివారం రాత్రి గుర్తించారు. అయితే, మున్నేటి వరద ఉధృతి కారణంగా మృతదేహాన్ని ఆదివారం ఉదయం తీయిస్తామని ఖమ్మం త్రీటౌన్ సీఐ మోహన్‌బాబు తెలిపారు. మృతుడిని మహబూబాబాద్ జిల్లా గార్ల మండలానికి బందెల వెంకటేశ్వర్లుగా గుర్తించగా, ఆకేరులో చేపలు పడుతూ ప్రమాదవశాత్తు నీళ్లలో జారి పడి ఉండొచ్చని భావిస్తున్నారు.

ఒకే ఈతలో రెండు దూడలు జననం

ఒకే ఈతలో రెండు దూడలు జననం