
పండుగకు వచ్చేస్తున్నారు !
సద్దుల బతుకమ్మ, దసరా పండుగ సమీపిస్తుండం.. ఉద్యోగులకు శని, ఆదివారం వరుస సెలవులు రావడంతో జనమంతా పిల్లాపాపలతో స్వస్థలాల బాట పట్టారు. దీంతో ఖమ్మంలోని పాత, కొత్త బస్టాండ్లు శనివారం కిటకిటలాడాయి. పండుగకు సొంత గ్రామాలకు వెళ్లే వారే కాక పాఠశాలలు, కళాశాలల నుంచి వెళ్తున్న విద్యార్థులతో బస్టాండ్లలో రద్దీ నెలకొంది. కొన్ని మార్గాల్లో సరిపడా బస్సులు లేక హాల్టింగ్ పాయింట్ వద్దకు వస్తుండగానే సీటు దక్కించుకునేందుకు పోటీ పడ్డారు. – స్టాఫ్ ఫొటోగ్రాఫర్
ప్రయాణికులతో రద్దీగా ఉన్న ఖమ్మం పాత బస్టాండ్

పండుగకు వచ్చేస్తున్నారు !