
ప్రముఖ వ్యాపారి జీఆర్‌ఆర్ మృతి
ఖమ్మంవ్యవసాయం: ప్రముఖ పత్తి వ్యాపారి గొడవర్తి రామారావు(83) అనా రోగ్యంతో బాధపడుతూ గురువారం రాత్రి ఖమ్మంలోని స్వగృహంలో మృతిచెందారు. కామేపల్లి మండలం కొత్త లింగాలకి చెందిన రామారావు ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా, ఆతర్వాత ఎంఈఓగా పనిచేసి రిటైర్ అయ్యారు. అనంతరం వ్యాపారంపై మక్కువతో ఖమ్మం చాంబర్ ఆఫ్ కామర్స్‌లో దిగుమతి శాఖ సభ్యుడిగా చేరిన రామారావు కమీషన్ వ్యా పారం చేస్తూ ఖమ్మంలోనే స్థిరపడ్డారు. ఉపాధ్యాయ వృత్తి నుంచి రావడంతో ఆయనను వ్యాపారులు ‘పత్తి పంతులు గారు’గా పిలుస్తారు. ఖమ్మం రూరల్ మండలంలో జిన్నింగ్ మిల్లులు కూడా ఏర్పాటుచేసిన ఆయన భార్య గౌరమ్మ ఈ ఏడాది ఏప్రిల్ 2న మరణించగా ఆరునెలలు గడవకుండానే రామారావు సైతం కన్నుమూశారు. కాగా, ఆయన కుమారులు గొడవర్తి శ్రీనివాసరావు చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రధాన కార్యదర్శిగా పనిచేయగా, నాగేశ్వరరావు స్తంభాద్రి అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకు డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. అలాగే, జీఆర్‌ఆర్‌కు కుమార్తె దమ్మాలపాటి రమాదేవి ఉన్నారు. కాగా, రామారావు మృతదేహం వద్ద ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చిన్న కృష్ణారావు, మెంతుల శ్రీశైలం, బాధ్యులు జీవై.నరేష్, మన్నెం కృష్ణ, తల్లాడ రమేష్, దిరిశాల వెంకటేశ్వర్లు, ముత్యం ఉప్పల్ రావు, మాటేటి నాగేశ్వరరావు, యడ్లపల్లి సతీష్‌కుమార్, నల్లమల ఆనంద్, తూములూరి లక్ష్మీనరసింహా రావు, కురువెల్ల ప్రవీణ్‌కుమార్, సోమారపు సుధీర్‌కుమార్, మేడబోయిన లింగయ్య, సిరికొండ వెంకటేశ్వర్లు, బీఆర్‌ఎస్‌నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు, కార్పొరేటర్లు కర్నాటి కృష్ణ, దండా జ్యోతి రెడ్డి, ముత్యాల వెంకటప్పారావు, యలమద్ది రవి, దొండేటి అశ్వానీకుమార్, చావా శ్రీనివాస్, ఎర్ర అప్పారావు, వీరభద్రం, కందాల వీరేందర్ తదితరులు నివాళులర్పించారు. అలాగే, మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు, మాజీమంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, వ్యవసాయ కమిషన్ డైరెక్టర్ రాంరెడ్డి గోపాల్‌రెడ్డి తదితరులు రామారావు కుమారులను ఫోన్‌లో పరామర్శించారు.
నివాళులు అర్పించిన
నేతలు, వ్యాపారులు

ప్రముఖ వ్యాపారి జీఆర్‌ఆర్ మృతి