
ఐక్యతతోనే కాపు కార్పొరేషన్ సాధన
ఖమ్మం మామిళ్లగూడెం: మున్నూరు కాపులంతా ఐక్యంగా ఉండడం ద్వారా ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పా టు, నిధుల సాధన సాధ్యమవుతుందని ము న్నూరు కాపు సంఘం రాష్ట అధ్యక్షుడు డాక్టర్ కొండ దేవయ్య తెలిపారు. ఖమ్మంలో శుక్రవారం జరి గిన సంఘం సమావేశంలో ఆయన మాట్లాడుతూ జనాభా లెక్కల సమయాన ప్రతీ ఇంట వివరాలు నమోదు చేయించాలని సూచించారు. అనంతరం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్‌గా శెట్టి రంగారావు, ఉపాధ్యక్షుడిగా పసుపులేటి దేవేందర్, కార్యదర్శిగా గోవిందు శ్రీనివాసరావు, సహాయ కార్యదర్శిగా సూరంశెట్టి కిషోర్, ఆర్గనైజింగ్ కార్యదర్శిగా వేముల కృష్ణప్రసాద్ ను ఎంపిక చేసినట్లు తెలిపారు. ఆతర్వాత దేవయ్యను నాయకులు సత్కరించారు. ఈసమావేశంలో నాయకులు కొత్త సీతారాములు, పోదిల రవికుమార్, జనార్దన్, నాగ భూషణం, శ్రీదేవి, రాపర్తి శరత్, చామకూరి వెంకటనారాయణ, మాడురి పూర్ణ, మడూరి సైదారావు, జేవీఎల్.నరసింహరావు, నరేష్, చెరుకూ రి పూర్ణ, మాదంశెట్టి హన్మంతరావు, విప్లవకుమార్, నరసింహరావు, వెంకటేశ్వర్లు, సోమయ్య, సూర య్య, ఆర్.కే. నాయుడు, జయప్రకాష్ పాల్గొన్నారు.