
మహిళలు పోరాటాల్లోకి రావాలి
బోనకల్: పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ, మల్లు స్వరాజ్యం స్ఫూర్తితో మహిళలు పోరాటాల్లోకి రావాలని ఐద్వా రాష్ట్ర కార్యదర్శి మల్లు లక్ష్మి పిలుపునిచ్చారు. బోనకల్ మండలం ముష్టికుంట్లలో ఐద్వా మధిర డివిజన్ మహాసభ పయ్యావుల ప్రభావతి అధ్యక్షతన శుక్రవారం నిర్వహించారు. తొలుత పతాకాన్ని ఐద్వా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు బుగ్గవీటి సరళ ఆవిష్కరించగా అమరుల చిత్రపటాల వద్ద నివాళులర్పించాక మల్లు లక్ష్మి మాట్లాడారు. మహిళలు శాస్త్ర, సాంకేతిక రంగాల్లో పురుషులతో పాటు సమానంగా రాణిస్తున్నారన్నారు. ఐద్వా పోరాటాల ఫలితంగానే అనేక హక్కులు సాధించుకున్నామని తెలిపారు. మహిళలు లేకపోతే వ్యవస్థ లేదని వెల్ల డించిన ఆమె బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మహిళలపై దాడులు, వేధింపులు, అత్యాచారాలు, హత్యలు పెరిగిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. అనంతరం మధిర డివిజన్ కమిటీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా జొన్నలగడ్డ సునీత, కళావతిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సీపీఎం డివిజన్ కార్యదర్శి మడుపల్లి గోపాలరావు, నాయకులు బండి పద్మ, మెరుగు రమణ, జొన్నలగడ్డ సునీత, బంధం వెంకటరాజ్యం, రజిత, కొంగర వెంకటనారాయణ తదితరులు పాల్గొన్నారు.
ఐద్వా రాష్ట్ర కార్యదర్శి మల్లు లక్ష్మి