సత్తుపల్లి: మండలంలోని రేజర్ల గ్రామానికి చెందిన జలగం వెంగళరావు అనుచరుడు చింతల గోపిరెడ్డి భార్య సీతారావమ్మ (108) మంగళవారం రాత్రి కన్నుమూశారు. ఈ సందర్భంగా పలువురు సంతాపం తెలిపారు.
విక్రమ్‌నగర్‌లో వ్యక్తి మృతదేహం లభ్యం
కొణిజర్ల: మండలంలోని విక్రమ్‌నగర్‌లో అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతదేహం లభ్యమైన ఘటన బుధవారం చోటుచేసుకుంది. ఎస్‌ఐ సూరజ్ కథనం ప్రకారం.. విక్రమ్‌నగర్ మిషన్ భగీరథ వాటర్‌ట్యాంక్ కింద గడ్డిలో ఓ వ్యక్తి మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఎస్‌ఐ సూరజ్ సిబ్బందితో ఘటనా స్థలానికి వెళ్లి ఆరా తీయగా మృతుడు రఘునాథపాలెం మండలం కోటపాడు గ్రామానికి చెందిన బలంతు రవి (35)గా గుర్తించారు.
మృతుడు ఈ నెల 22న ఖమ్మం అర్బన్ మండలం ఖానాపురం హవేలీ ఇండస్ట్రియల్ ఏరియాలో ఓ మహిళపై హత్యాయత్నానికి పాల్పడిన కేసులో నిందితుడిగా గుర్తించారు. హత్యాయత్నం చేసిన తర్వాత భయంతో పారిపోయి విక్రమ్‌నగర్ చేరుకుని అనుమానాస్పదంగా మృతి చెందినట్లు ఎస్‌ఐ తెలిపారు. మృతుడి ఒంటిపై ఎలాంటి గాయాలు గుర్తించలేదని తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఖమ్మం ప్రభుత్వాస్పత్రికి తరలించి ఎస్‌ఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

శతాధిక వృద్ధురాలు కన్నుమూత