
ఆది సేవా కేంద్రాలు ప్రారంభం
కారేపల్లి: ఆదికర్మ యోగి అభియాన్ పథకంలో భాగంగా మండలంలోని మాధారం, ఉసిరికాయలపల్లి, పేరుపల్లి, రేలకాయలపల్లి, కోమట్లగూడెం, గేటుకారేపల్లి, బాజుమల్లాయిగూడెం, మాణిక్యారంల్లో ఆది సేవా కేంద్రాలను ప్రారంభించారు. ఈ కేంద్రాలను గిరిజన సంక్షేమ శాఖ డీడీ ఎన్.విజయలక్ష్మి మంగళవారం ప్రారంభించగా, పథకంపై అవగాహన కల్పించేలా గ్రామాల్లో ర్యాలీ నిర్వహించారు. అనంతరం డీడీ మాట్లాడుతూ గిరిజన ప్రాంతాల్లో మౌలిక వసతులు కల్పించేలా ఈ పథకాన్ని అమలుచేస్తున్నారని తెలిపారు. గ్రామపంచాయితీల వారీగా సమస్యలపై దరఖాస్తుల ద్వారాను కేంద్రాల్లో సేకరిస్తామని, ఆపై అక్టోబర్ 7వ తేదీన గ్రామసభల్లో చర్చించాక ఉన్నతాధికారులకు నివేదికలు ఇస్తామని వివరించారు. ఏసీఎంఓ ఎల్.రాములు, ఐసీడీఎస్ సూపర్‌వైజర్ మాలతి, గ్రామకార్యదర్శులు నిరంజన్, విజయ్, సురేష్, పాషా తదితరులు పాల్గొన్నారు.