
ఆకేరులో పడి రైతు గల్లంతు..
తిరుమలాయపాలెం: పొలం పనులకు వెళ్లి వస్తూ ఆకేరు నది దాటే క్రమాన రైతు వరదలో గల్లంతు కాగా.. ఆయన మృతదేహానిన ఎన్‌డీఆర్‌ఎఫ్, అగ్నిమాపక శాఖ సిబ్బంది వెలికితీశారు. మండలంలోని పడమటి తండాకు చెందిన రైతు గుగులోతు రాములు(58) ఆకేరు పక్కన మరిపెడ మండల పరిధిలోని బలరాంతండాలో భూమి కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నాడు. సోమవారం సాయంత్రం ఆయన ఆకేరు చెక్‌డ్యాం మీదుగా ఇంటికి వస్తుండగా ప్రమాదవశాత్తు ఆకేరులో పడిపోయాడు. ఈ విషయం తెలిసి గ్రామస్తులు గాలించినా ఫలితం కానరాలేదు. ఈమేరకు మంగళవారం పోలీసులు, ఎన్డీఆర్‌ఎఫ్, ఫైర్ సిబ్బంది సుమారు ఐదుగంటల పాటు గాలించగా బ్రిడ్జి కూలిన శిథిలాల కింద రాములు మృతదేహాన్ని గుర్తించి వెలికితీశారు. ఆయనకు భార్య బోడి, ఓ కుమారుడు ఉన్నారు.
సాగర్ కాల్వలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం
కొణిజర్ల: కొణిజర్ల మండలం తనికెళ్ల సమీపాన ఎన్నెస్పీకాల్వలో గుర్తు తెలియని వ్యక్తి(35) మృతదేహాన్ని మంగళవారం గుర్తించారు. మృతదేహం ఉందనే విషయమై స్థానికులు జీపీఓ ద్వారా ఇచ్చిన సమాచారంతో ఎస్‌ఐ సూరజ్ ఆధ్వర్యాన బయటకు తీయించారు. మృతుడు నలుపు రంగు నెక్ టీ షర్టు, లోదుస్తులు ధరించి ఉండగా, అన్నం ఫౌండేషన్ సభ్యుల సహకారంతో మృతదేహాన్ని ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. మృతుడి ఆచూకీ తెలిసిన వారు 87126 59150 నంబర్‌లో సంప్రదించాలని ఎస్సై సూచించారు.
చికిత్స పొందుతున్న
రైతు మృతి
కారేపల్లి: పురుగు మందు తాగిన రైతు చికిత్స పొందుతూ మృతి చెందాడు. మండలంలోని మంగళి తండా గ్రామానికి చెందిన ధరావత్ పంతులు (52) నాలుగెకరాల్లో పత్తి, వరి సాగు చేస్తుండగా, ఇటీవల ఆయన భార్య హసాలి అనారోగ్యానికి గురవడంతో చికిత్స చేయించాడు. ఈక్రమాన అప్పులతో ఆర్థికంగా ఇబ్బందులు ఎదురుకాగా ఈనెల 22వ తేదీన పురుగుల మందు తాగాడు. ఆయనను కుటుంబీకులు ఖమ్మం ఆస్పత్రికి తరలించా చికిత్స పొందుతూ మంగళవారం మృతిచెందాడు. పంతులుకు భార్యతో పాటు ఓ కుమారుడు ఉన్నారు.
డంపింగ్ యార్డ్‌లో
బయో మైనింగ్‌పై ఆరా
ఖమ్మంమయూరిసెంటర్: ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ డంపింగ్ యార్డ్‌ను వరంగల్ ఆర్‌డీఎంఏ షాహిద్ మసూద్ మంగళవారం పరిశీలించారు. యార్డ్‌లో బయో మైనింగ్ ప్రక్రియ వివరాలపై ఆరాతీసిన ఇప్పటివరకు ఎంత మొత్తం లో వ్యర్థాలను శుభ్రం చేశారు, ఎంత స్థలం అందుబాటులోకి వచ్చిందనే వివరాలు తెలు సుకున్నారు. అలాగే, మిగతా వ్యర్థాలను గడువులోగా శుభ్రం చేయాలని ఏజెన్సీ బాధ్యులకు సూచించారు. తొలుత ఆర్‌డీఎంఏ మసూద్‌ను కేఎంసీ డిప్యూటీ కమిషనర్ కె.శ్రీనివాస్, ఏఎంసీ అనిల్‌కుమార్, ఈఈ కృష్ణాలాల్ కలిశారు.
మృతదేహాన్ని వెలికితీసిన ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందం

ఆకేరులో పడి రైతు గల్లంతు..