
సివిల్ జడ్జి కోర్టు ఏజీపీగా రత్నాకర్
ఖమ్మం లీగల్: ఖమ్మం సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్(ఏజీపీగా) సీనియర్ న్యాయవా ది కండెపనేని రత్నాకర్‌రావు నియమితులయ్యా రు. ఈమేరకు మంగళవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. న్యాయవాదిగా 1994లో నమోదైన రత్నాకర్ జిల్లా కోర్టులో ప్రాక్టీస్ చేస్తున్నాడు. తన నియామకానికి సహకరించిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు ఆయన కృతజ్ఞతలు తెలపగా, కాంగ్రెస్ లీగల్ సెల్ బాధ్యులతో పాటు న్యాయవాదులు పలువురు ఆయనను అభినందించారు.
రాష్ట్ర మహిళా క్రికెట్ జట్టుకు తాటిగూడెం బాలిక
కరకగూడెం: అండర్ – 15 రాష్ట్ర స్థాయి మహిళా క్రికెట్ జట్టుకు కరకగూడెం మండలంలోని తాటిగూడెంకు చెందిన రామటెంకి దేవీప్రియ ఎంపికై ంది. తొమ్మిదో తరగతి చదువుతున్న బాలిక క్రికెట్‌లో ప్రతిభ కనబరిచి అండర్ –15 మహిళా క్రికెట్ ప్రాబబుల్ జట్టులో స్థానం దక్కించుకుంది. ఆమె తండ్రి ప్రభుత్వ ఉపాధ్యాయుడైన హనుమంతరావు దేవీప్రియకు క్రికెట్‌పై ఉన్న ఆసక్తిని గమనించి శిక్షణ ఇప్పించారు. ఈనెల 20న హైదరాబాద్‌లో నిర్వహించిన ఓపెన్ సెలక్షన్ ట్రయల్స్‌లో 600 మంది క్రీడాకారిణుల మధ్య ప్రతిభ చాటిన దేవీప్రియ ప్రాబబుల్ జట్టులో చోటు దక్కించుకోగాహెడ్ కోచ్ సురేందర్రెడ్డి, కోచ్‌లు వెంకట్ యాదవ్, బుచ్చిబాబు, ఇర్ఫాన్ అభినందించారు.
అండర్ – 15 ప్రాబబుల్ టీమ్‌కు ఎంపిక

సివిల్ జడ్జి కోర్టు ఏజీపీగా రత్నాకర్