
జీఎస్టీ పేరిట ప్రజలపై భారం
వైరా: నరేంద్రమోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం ఏర్పడి నాటి నుంచి ఇప్పటివరకు వరకు జీఎస్టీ పేర ప్రజలపై భారం మోపుతూ లక్షల కోట్ల ప్రజాధనాన్ని దోపిడీ చేశారని సీపీఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు విమర్శించారు. ఈ కారణంగా ఆర్థిక వ్యవస్థ దెబ్బతినడంతో ప్రజలను దృష్టి మరల్చేందుకు స్వదేశీ మంత్రం జపిస్తున్నారని తెలిపారు. వైరాలోని సీపీఎం కార్యాలయంలో దొంతబోయిన నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజల పరిస్థితుల దృష్ట్యా తక్షణమే పెట్రోలు, డీజిల్‌ను జీఎస్‌టీ పరిధిలోకి తీసుక రావాలని డిమాండ్ చేశారు. అలాగే, రాష్ట్రపభుత్వం హామీల అమలులో కాలయాపన చేయొద్దని సూచించారు. సీపీఎం వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం, నాయకులు తాళ్లపల్లి కృష్ణ, సుంకర సుధాకర్, కొండెబోయిన నాగేశ్వరరావు, చింతనిప్పు చలపతిరావు, కుటుంబరావు, ఉమాపతి, నాగేశ్వరరావు, శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సీపీఎం జిల్లా కార్యదర్శి నాగేశ్వరరావు