
రీజినల్ స్థాయి క్విజ్ పోటీల్లో ప్రతిభ
ఖమ్మం సహకారనగర్: కేంద్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ మంత్రిత్వ శాఖ, ఎన్‌ఏసీఓఽ ఆధ్వర్యాన ఎనిమిది రాష్ట్రాల స్థాయి క్విజ్ పోటీలు బీహార్ రాష్ట్రంలో ఇటీవల నిర్వహించగా ఖమ్మం ఏఎస్‌ఆర్ శాంతినగర్ జూనియర్ కళాశాల విద్యార్థిని దేవీ శ్రీప్రసన్న ప్రథమ బహుమతి సాధించిందని ప్రిన్సిపాల్ గోవిందరావు తెలిపారు. ఎయిడ్స్ నియంత్రణ సంస్థ తరఫున కాలేజీల స్థాయి, రాష్ట్రస్థాయిలో ప్రథమ స్థానం సాధించిన ఆమె రీజినల్ స్థాయి పోటీల్లోనూ సత్తా చాటిందని వెల్లడించారు. ఈ సందర్భంగా రూ.50వేల నగదు బహుమతి అందుకోగా, నాగాలాండ్‌లో జరిగే జాతీయస్థాయి పోటీలకు ఎంపికై ందని తెలిపారు. విద్యార్థిని శ్రీప్రసన్నతో పాటు ఆమెను ప్రోత్సహించిన అధ్యాపకులు నరేష్, కౌన్సిలర్ భరత్‌కుమార్, లింగానాయక్‌ను ప్రిన్సిపాల్ అభినందించారు.