
చట్టాలపై అవగాహన అవసరం
ఖమ్మం లీగల్: ప్రతీఒక్కరు చట్టాలపై అవగాహన పెంపొందించుకోవాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కే.వీ.చంద్రశేఖర్‌రావు సూచించారు. తద్వారా నష్టం ఎదురైతే న్యాయసాయం పొందొచ్చని తెలిపారు. ఖమ్మంలోని మంచికంటి భవన్‌లోలో జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యాన శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. చట్టాలపై అందరూ అవగాహన పెంచుకుని, నానాటికీ పెరుగుతున్న సైబర్ నేరాల బారిన పడకుండా జాగ్రత్త వహించాలని తెలిపారు. అనంతరం టోల్‌ఫ్రీ నంబర్లు 1930, 15100, న్యాయ సేవాధికార సంస్థ ద్వారా అందే ఉచిత న్యాయసాయంపై న్యాయమూర్తి అవగాహన కల్పించారు. సైబర్ క్రైం ఏసీపీ ఫణీందర్, జేవీవీ రాష్ట్ర అధ్యక్షుడు చెలిమెల రాజేశ్వర్ పాల్గొన్నారు.