
ప్రణాళికాయుతంగా ఖమ్మం అభివృద్ధి
● దేవుళ్లు ఎప్పటికీ ప్రజలను ఇబ్బంది పెట్టరు... ● అభివృద్ధి పనుల శంకుస్థాపనలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
ఖమ్మం అర్బన్: ఖమ్మం నగరాన్ని ప్రణాళికాయుతంగా అభివృద్ధి చేసేలా మాస్టర్ ప్లాన్ రూపొందించామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఖమ్మం 12వ డివిజన్‌లో రూ.49.80 లక్షలతో నిర్మించనున్న పెట్ పార్క్, రూ.89 లక్షలతో నిర్మించే సీసీ రోడ్డు విస్తరణ, కల్వ ర్టు పనులకు సోమవారం ఆయన శంకుస్థాపన చేశాక మాట్లాడారు. అభివృద్ధి పనులు పది కాలాల పాటు నిలిచేలా అధికారులు పర్యవేక్షించాలని సూ చించారు. భూఆక్రమణలను అధికారులు మొదటి దశలోనే అడ్డుకోవాలని స్పష్టం చేశారు. కాగా, రోడ్లపై ప్రార్థనా మందిరాలు అవసరం లేదని, దేవుళ్లు ఎప్పటికీ ప్రజలకు ఇబ్బంది కలిగించరని అన్నారు. చెరువు బజార్, రైల్వే స్టేషన్ రోడ్డు తది తర ప్రాంతాల్లో రహదారుల విస్తరణతో ఖమ్మం వాసులకు ట్రాఫిక్ ఇక్కట్లు తీరతాయని తెలిపారు. అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి, మేయర్ పి.నీరజ, మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్య, మార్కెట్ చైర్మన్ యరగర్ల హన్మంతరావు, కార్పొరేటర్లు చిరుమామిళ్ల లక్ష్మీనాగేశ్వరరావు, కమర్తపు మురళి, నాయకులు సాధు రమేష్‌రెడ్డి, బోడా శ్రావణ్‌కుమార్, తదితరులు పాల్గొన్నారు.
లాభసాటి పంటల సాగుపై దృష్టి
రఘునాథపాలెం: రైతులు లాభసాటి పంటలైన ఆయిల్ పామ్ తదితరాల సాగుపై దృష్టి సారించా లని రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. రఘునాథపాలెం మండలం లచ్చిరాం తండాలో రూ.2.15 కోట్ల వ్యయంతో చేపట్టే బీటీ రోడ్డు విస్తరణ, రూ.80 లక్షలతో నిర్మించే వంతెన పనులకు అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డితో కలిసి మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆయిల్‌పామ్ సాగు చేస్తే ప్రభుత్వం నుంచి సాయం అందుతుందని, మిర్చి, కూరగాయలను అంతర్ పంటలుగా సాగు చేస్తూ అదనపు ఆదాయం పొందొచ్చని తెలిపారు. వచ్చే వేసవిలో రఘునాథపాలెం మండలంలోని ప్రతీ చెరువులను నింపే బాధ్యత తీసుకుంటానని చెప్పారు. కాగా, విద్యుత్ లైన్ల మార్పునకు అవకాశాలను పరిశీలించాలని అధికారులను ఆదేశించిన మంత్రి ఇందిర మ్మ ఇళ్ల లబ్ధిదారులకు సాయం, ఆర్వోఏఎఫ్ ఆర్ పట్టాలు పొందిన రైతుల విషయమై సూచనలు చేశారు. రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, జిల్లా వ్యవసాయాధికారి పుల్లయ్య, పీఆర్ ఈఈ మహేష్ బాబు, విద్యుత్ డీఈ రామారావు, ఏడీఈలు సంజయ్‌కుమార్, సతీష్, చిరంజీవి, తహసీల్దార్ శ్వేత, ఎంపీఓ శ్రీనివాస్‌రెడ్డి, సొసైటీ చైర్మన్ యలగొండస్వామి, ఎఫ్‌ఆర్‌ఓ నాగేశ్వరరావు, మార్కెట్, ఆత్మ కమిటీల చైర్మన్లు యరగర్ల హన్మంతరావు, దిరిశాల వెంకటేశ్వర్లు, నాయకులు మానుకొండ రాధాకిషోర్, పువ్వాళ్ల దుర్గాప్రసాద్, సాధు రమేష్‌రెడ్డి, దేవ్‌సింగ్, బాషా, కొంటెముక్కల నాగేశ్వరరావు, లాలు, కృష్ణప్రసాద్, నవీన్ తదితరులు పాల్గొన్నారు.