
ఉమ్మడి జిల్లా క్రీడాజట్లు సిద్ధం
ఖమ్మం స్పోర్ట్స్: జిల్లా పాఠశాలలు, జూనియర్ కళాశాలల క్రీడా సంఘాల ఆధ్వర్యాన వివిధ క్రీడాంశాల్లో జిల్లా జట్లను ఎంపిక చేశారు. ఖమ్మంలోని ఎస్‌ఆర్‌అండ్‌బీజీఎన్‌ఆర్ కళాశాల మైదానం, పటేల్ స్టేడియంలో ఉమ్మడి జిల్లా పాఠశాలల స్థాయి అండర్–19 ఫుట్‌బాల్ జట్లు, అండర్–17, 19 ఉషూ జట్ల ఎంపికకు పోటీలు నిర్వహించారు. అండర్–19 బాలుర ఫుట్‌బాల్ ఎంపికలకు 50 మంది, ఉషూ ఎంపికలకు 45 మంది క్రీడాకారులు హాజరయ్యారు. కాగా, ఫుట్‌బాల్ జట్టు జనగామలో ఈనెల 24నుంచి జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో, ఉషూ జట్లు ఈనెల 25నుంచి మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురులో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటాయని క్రీడా సంఘాల కార్యదర్శులు ఎం.డీ.మూసాకలీం, పి.వెంకటేశ్వర్లు తెలిపారు. ఎంపిక పోటీలను డీవైఎస్‌ఓ టి.సునీల్‌రెడ్డి ప్రారంభించగా, వివిధ క్రీడల కోచ్‌లు కె.ఆదర్శ్‌కుమార్, పి.పరిపూర్ణాచారి, భీమ్‌రాజ్, సైదేశ్వరరావు, ముజాహిద్, చంద్రశేఖర్, సత్యనారాయణ పాల్గొన్నారు.
జట్ల వివరాలు...
ఉమ్మడి జిల్లా అండర్–19 ఫుట్‌బాల్ జట్టుకు ఎస్‌డీ. యాసీర్ పాషా, బి.భరత్‌కుమార్, హెచ్.సాయి సృజన్, జి.అభిరాం, టి.కార్తీక్, వి.శివగోపాల్, జి.ప్రణీత్, డి.ఆనంద్‌బాబు, సీహెచ్.చెన్నకేశవ్, కె.అఖిల్, పి.శ్రీహర్ష, హెచ్.రుత్విక్, సీహెచ్.ఆకాష్, టి.యశ్వంత్, ఈ.ఉదయ్‌రాం, జి.సిద్ధార్థ, కె.నిశాంత్ ఎంపికవగా, స్టాండ్ బైగా టి.హేమంత్, ఏ.మనోజ్, ఏ.ప్రేమ్‌కుమార్, ఏ.సానత్, బి.శ్యాంప్రసాద్‌ను ఎంపిక చేశా రు. అలాగే, ఉషూ జట్లకు సాయిమహర్షి, హర్షణ్, కె. చక్రధర్ ఆర్యన్, అభిషేక్‌గౌడ్, యజ్ఞసేన్, ఉమర్ రూఖ్, చైత్ర వర్షిణి, సంజన, భావన, జాస్మిన్, షేక్ ఫీరోజ్, ఎం.డీ ఫారూఖ్‌బేగ్ ఎంపికయ్యారు.