
వరి పైర్లను పరిశీలించిన అధికారులు
తల్లాడ: తల్లాడ మండలం పలు గ్రామాల్లోని వరి పైర్లలో కలుపు పెరిగి ఎన్ని మందులు పిచికారీ చేసినా ఫలితం లేక రైతులు ఆందోళన చెందుతున్న విషయమై ‘సాక్షి’లో సోమవారం ‘కలుపు మందుల్లోనూ కల్తీ’ శీర్షికన కథ నం ప్రచురితమైంది. దీంతో బిల్లుపాడు, అన్నారుగూడెంల్లో వరి పైర్లను ఏఓ ఎండీ.తాజుద్దీన్ తదితరులు పరిశీలించారు. ఈ సమస్య మండలంలోని వెదజల్లిన పద్ధతిలో వరి సాగు చేసిన పొలాల్లోనే ఉందని తెలిపారు. పరిశీ లన కోసం శాస్త్రవేత్తలను పంపించాలని డీఏఓను కోరినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ హసీనా, రైతులు పాల్గొన్నారు.
రైతు ఆత్మహత్యాయత్నం
కారేపల్లి: ఆర్థిక ఇబ్బందులతో ఓ రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. మండలంలోని మంగళితండా గ్రామానికి చెందిన రైతు ధరావత్ పంతులు నాలుగెకరాల్లో పత్తి, వరి సాగు చేస్తున్నాడు. ఇటీవల ఆర్థిక ఇబ్బందులు పెరగడంతో సోమవారం ఇంటి వద్ద ఆయన పురుగులమందు తాగాడు. ఈ విషయాన్ని గమనించిన కుటుంబ ఇల్లెందులో చికిత్సఅనంతరం ఖమ్మం ఆస్పత్రికి తరలించారు.

వరి పైర్లను పరిశీలించిన అధికారులు