వైరా/తిరమలాయపాలెం: మిషన్ భగీరథ పధకం కార్మికులు పెండింగ్ వేతనాలు చెల్లించాలనే డిమాండ్‌తో సోమవారం సమ్మెకు దిగారు. ఈమేరకు వైరాలోని భగీరథ కార్యాలయం ఎదుట ధర్నా చేయగా.. వివిధ పార్టీల నాయకులు సంఘీభావం తెలిపి మాట్లాడారు. ఈనెల 7వ తేదీన జీతాలు ఇస్తామని హామీ ఇచ్చిన అధికారులు 15రోజులు దాటినా స్పందించడం లేదని ఆరోపించారు. దీంతో పండుగ వేళ పస్తులు ఉండలేక సమ్మెకు దిగారని తెలిపారు. కాగా, తిరుమలాయపాలెం మండలంలోని మాదిరిపురం భగీరథ పంపుహౌజ్ వద్ద కూడా కార్మికులు ధర్నా నిర్వహించి మండల వ్యాప్తంగా నీటి సరఫరా నిలిపేశారు. కార్మికుల సమ్మెతో జిల్లాలోని పలు ప్రాంతాల్లోనూ నీటి సరఫరా నిలిచిపోయింది. ఈ కార్యక్రమాల్లో వివిధ సంఘాల నాయకులు, జేఏసీ బాధ్యులు తిరుమలాచారి, బొంతు రాంబాబు, చింతనిప్పు చలపతిరావు, బాణాల వెంకటేశ్వరరావు, పాపగంటి రాంబాబు, అన్నం వెంకయ్య, వేల్పుల అనంతరావు, అనుబోతు బాలకృష్ణ, మద్దెల రవి, బత్తుల కిషోర్, యాకూ బ్ వలీ, శ్రీనివాసరావు, భరత్, ఉపేందర్, అన్వేష్, వెంకన్న, శ్రీను, నాగేశ్వరరావు, కిషన్ తదితరులు పాల్గొన్నారు.
పలు ప్రాంతాల్లో నిలిచిన నీటి సరఫరా