
అడిషనల్ డీసీపీగా రామానుజం
ఖమ్మంక్రైం: ఖమ్మం అడిషనల్ డీసీపీ(అడ్మిన్)గా బి.రామానుజం సోమవారం బాధ్యతలు స్వీకరించారు. కొంతకాలంగా ఖాళీగా ఈ పోస్టులో పదోన్నతి పొందిన రామానుజంకు పోస్టింగ్ ఇచ్చారు. గతంలో ఆయన ఉమ్మడి జిల్లాలో ఎస్‌ఐ, సీఐ, డీఎస్పీగా విధులు నిర్వర్తించారు. బాధ్యతలు స్వీకరించాక సీపీ సునీల్‌దత్‌ను మర్యాదపూర్వకంగా కలవగా, రామానుజంకు అధికారులు శుభాకాంక్షలు తెలిపారు.
జిల్లాకు ఐదుగురు
ఏఎంవీఐలు
ఖమ్మంక్రైం: ఇటీవల శిక్షణ పూర్తి చేసుకున్న ఐదుగురు అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్‌స్పెక్టర్ల(ఏఎంవీఐ)ను జిల్లాకు కేటాయించారు. ఈ సందర్భంగా సోమవారం వారు ఖమ్మంలో జిల్లా రవాణా శాఖాధికారి వెంకటరమణకు రిపోర్ట్ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఏఎంవీఐల్లో సుమలత, రవిచందర్, గోపికృష్ణ, దినేష్‌కు ఖమ్మంలో, రాజశేఖర్‌రెడ్డికి సత్తుపల్లి కార్యాలయంలో బాధ్యతలు అప్పగించామని తెలిపారు. వీరు ఎన్‌ఫోర్స్‌మెంట్ విధులు నిర్వర్తిస్తారని చెప్పారు. కాగా, 15ఏళ్లు దాటిన వాహనాలకు ఆర్‌సీలు రెన్యూవల్ చేయించుకోవాలని వాహనదారులకు సూచించారు. ఓవర్‌లోడ్‌తో నడిచే వాహనాల గుర్తింపునకు తనిఖీలు ముమ్మరం చేస్తామని ఆర్‌టీఓ వెల్లడించారు. ఈకార్యక్రమంలో ఏఓ సుధాకర్, ఉద్యోగులు పాల్గొన్నారు.
కలెక్టరేట్‌లో ‘బతుకమ్మ’
ఖమ్మంమయూరిసెంటర్: బతుకమ్మ సంబరాలు రెండో రోజైన సోమవారం కలెక్టరేట్‌లో సంక్షేమ శాఖల ఆధ్వర్యాన నిర్వహించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ శాఖల అధికారులు, ఉద్యోగులు సంబురాల్లో పాల్గొనగా.. బతుకమ్మల చుట్టూ ఆడిపాడారు. ఎస్సీ అభివృద్ధి శాఖ ఇన్‌చార్జి డీడీ, బీసీడబ్ల్యూఓ జి.జ్యోతి, గిరిజన సంక్షేమ శాఖ డీడీ ఎన్.విజయలక్ష్మి, మైనారిటీ శాఖ ఆర్‌సీఓ అరుణకుమారి, బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ శ్రీలత, వసతిగృహాల ఉద్యోగులు పాల్గొన్నారు.
ప్రారంభమైన ఓపెన్ స్కూల్ పరీక్షలు
ఖమ్మం సహకారనగర్: ఓపెన్ స్కూల్ సొసైటీ ద్వారా పదో తరగతి, ఇంటర్ పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి. పదో తరగతికి పరీక్షకు 63మందిలో 51మంది(80.95శాతం), ఇంటర్ పరీక్షకు 51మందిలో 40మంది(78.43 శాతం) హాజరయ్యారని ఇన్‌చార్జ్ డీఈఓ దీక్షారైనా, ఓపెన్ స్కూల్ కోఆర్డినేటర్ కె.మంగపతిరావు తెలిపారు. కాగా, పలు కేంద్రాలను డీఐఈఓ రవిబాబు తనిఖీ చేశారు.
యూరియా కోసం రాత్రివరకూ పడిగాపులు
నేలకొండపల్లి: నేలకొండపల్లి పీఏసీఎస్ పరిధి అప్పలనరసింహాపురం గోదాం వద్ద రాయగూడెం, అప్పలనరసింహాపురం రైతులకు సోమవారం సాయంత్రం యూరియా పంపిణీ మొదలుపెట్టారు. కేంద్రానికి 110 యూరియా బస్తాలు రాగా, గతంలో కూపన్లు జారీ చేసిన వారికి ఇస్తామని ప్రకటించారు. అయితే, గతంలో తీసుకున్న కొందరికే మళ్లీ ఇస్తున్నారని పలువురు ఆందోళనకు దిగారు. దీంతో ఏఓ ఎం.రాధ చేరుకుని అందరికీ కూపన్లు జారీ చేసి త్వరలోనే సరఫరా చేస్తామని నచ్చచెప్పారు. ఈ ఆందోళనతో ఆలస్యం జరగగా రాత్రి పొద్దుపోయే వరకు పోలీసు పహారా నడుమ పంపిణీ చేశారు.

అడిషనల్ డీసీపీగా రామానుజం

అడిషనల్ డీసీపీగా రామానుజం

అడిషనల్ డీసీపీగా రామానుజం