
ఏం చేద్దాం.. ఎక్కడ పోటీ చేద్దాం ?
రిజర్వేషన్ల మాటెలా ఉన్నా ఎన్నికల నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే గ్రామపంచాయతీ, పరిషత్ ఓటర్ల తుది జాబితా విడుదలైంది. జిల్లాలోని 571 గ్రామపంచాయతీల్లో 8,02,691 మంది ఓటర్లు ఉండగా, 5,214 పోలింగ్ స్టేషన్లు గుర్తించారు. మండల పరిషత్‌ల పరిధిలో 8,02,690 ఓటర్లకు 1,580 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటుచేస్తారు. ఇక రిజర్వేషన్లు ఖరారైతే ఈ నెలాఖరుకు ఎన్నికల షెడ్యూల్ విడుదలవుతుందనే ప్రచారంతో ఆశావహులు వ్యూహ, ప్రతివ్యూహాల్లో నిమగ్నమయ్యారు. ఎక్కడి నుంచి పోటీ చేస్తే మంచిది, గ్రామపంచాయతీల్లో బరిలో నిలవాలా.. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో పోటీ చేయాలా అన్న అంశాలపై అనుచరులతో చర్చిస్తున్నారు. ఏ స్థానం ఎవరికి రిజర్వ్ అవుతుందోనన్న అంచనాతో ఒకటి, రెండు స్థానాలు ఎంచుకుంటున్నట్లు తెలిసింది. ఎన్నికలు ఏ విధానంలో జరిగినా రాజకీయ పార్టీలే ప్రధాన పాత్ర పోషించనుండడంతో సీటు దక్కించుకునేందుకు పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులను ఒప్పించడంపై ఇప్పటికే ఆశావహులు దృష్టి సారించారు.

ఏం చేద్దాం.. ఎక్కడ పోటీ చేద్దాం ?