
ఉరుములు, మెరుపులతో భారీ వర్షం
తిరుమలాయపాలెం: తిరుమలాయపాలెంలో ఆదివా రం రోజంతా ఎండ, ఉక్కపోతతో ఉన్న వాతావరణం సాయంత్రానికి మారిపోయింది. ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమై ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది. సాయంత్రం 5–30గంటల నుంచి గంట పాటు వర్షం కొనసాగింది. మండలంలోని రమణాతండా, ఎదుళ్లచెరువు, పిండిప్రోలు, తిరుమలాయపాలెం, కొక్కిరేణి, ఎర్రగడ్డ తదితర ప్రాంతాల్లో వర్షప్రభావం ఉండగా, గాలిదుమారం, ఉరుముల శబ్దంతో జనం ఆందోళన చెందారు.
గుర్తుతెలియని వృద్ధుడు మృతి
ఖమ్మంక్రైం: ఖమ్మం రైల్వేస్టేషన్ మూడో నంబర్ ప్లాట్‌ఫామ్ వైపు సైకిల్ స్టాండ్ వద్ద గుర్తుతెలియని వృద్ధుడు(75) మృతి చెందాడు. ఆయన ధరించిన చొక్కాపై ఎంఆర్ టైలర్స్, ప్రకాష్‌నగర్ అని స్టిక్కర్ ఉండగా, ఇతర ఆధారాలు లభించలేదని త్రీటౌన్ పోలీసులు తెలిపారు. మృతుడి ఆచూకీ తెలిసిన వారు 87126 59116, 87126 59117, 87126 59115 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.
పాము కాటుతో రైతు...
● అరక దున్నుతుండగా ఘటన
తిరుమలాయపాలెం: పొలం పనుల్లో నిమగ్నమైన రైతును పాముకాటు వేయగా మృతి చెందాడు. మండలంలోని పైనంపల్లికి చెందిన బొమ్మెనపల్లి వీరన్న(53) ఆదివారం పత్తి చేనులో అరక దున్నుతుండగా కాలు కింద పడిన పాము కాటు వేసింది. దీంతో ఆయన పాముని చంపి గ్రామంలోకి వచ్చి కుటుంబీకులకు చెప్పగా ఖమ్మం తరలిస్తుండగా స్పృహ కోల్పోయాడు. అక్కడ ఓ ప్రైవేట్ హాస్పిటల్‌కి తీసుకెళ్లేలోగా వీరన్న మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఆయనకు భార్య మల్లమ్మ, కుమారుడు మహేష్, కుమార్తె హేమలత ఉన్నారు.

ఉరుములు, మెరుపులతో భారీ వర్షం

ఉరుములు, మెరుపులతో భారీ వర్షం