
హైఓల్టేజీతో అగ్నిప్రమాదం..
ఖమ్మంఅర్బన్: ఖమ్మం 16వ డివిజన్ ఖమ్మం–బోనకల్లు రోడ్డు కొత్తూరులో ఆదివారం ఉదయం భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఫొటోగ్రాఫర్ల అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు మూడంతస్తుల భవనంలోని మొదటి అంతస్తులో నివాసం ఉంటున్నాడు. ఆ ఇంట్లో విద్యుత్ హై ఓల్టేజీ కారణంగా షార్ట్ సర్క్యూట్ జరిగినట్లు తెలుస్తుండగా మంటలు చెలరేగాయి. దీంతో ఇంట్లోని ఫర్నీచర్, ఎలక్ట్రానిక్ సామగ్రి ఇతరత్రా పూర్తిగా కాలిపోవడంతో రూ.25 లక్షల మేర ఆస్తినష్టం జరిగినట్లు అంచనా వేస్తున్నారు. అగ్నిమాపక శాఖ సిబ్బంది చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చేలోగా సామగ్రి పూర్తిగా కాలిపోయాయి. అయితే, ప్రాణనష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇటీవలే వెంకట్ ఇల్లు నిర్మించుకోగా, ప్రస్తుత ప్రమాదంలో అంతా కాలిబూడిద కావడంతో ఆయన కుటుంబీకులు కన్నీరుమున్నీరయ్యారు.
రూ.లక్షల్లో ఆస్తి నష్టం