
‘మహమ్మద్ ప్రవక్త జీవితమే ఒక సందేశం’
ఖమ్మం మామిళ్లగూడెం: ప్రపంచానికి మార్గదర్శకుడిగా నిలిచిన మహమ్మద్ ప్రవక్త జీవితం అందరికీ ఒక సందేశమని ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్ ఎంపీ మహిబుల్లా నద్వీ తెలిపారు. ముస్లిం ఐక్య సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ముజాహిద్ ఇషాతి అధ్యక్షతన ఖమ్మం భక్త రామదాసు కళాక్షేత్రంలో జరిగిన సభలో ఆయన మాట్లాడారు. సకల మానవులకు ప్రవక్త దారి చూపారని చెప్పారు. జేఎన్‌యూ మాజీ ప్రొఫెసర్, సూఫీ సంఘం వ్యవస్థాపకులు డాక్టర్ హఫీజుర్ రెహమాన్, మాజీ ఎంపీ ఉబేద్దుల్లా ఖాన్ అజ్మీ, అబ్దుల్ వస్తా ఆన్ మాట్లాడగా, తొలుత ఖమ్మం ఎఫ్‌సీఐ గోదాంల నుంచి ఎన్నెస్పీ గెస్ట్‌హౌస్ వరకు ద్విచక్ర వాహనాల ర్యాలీ నిర్వహించారు. ఈ సభలో షేక్ హుస్సేన్, సయీద్ అహ్మద్ ఖాస్మి, హఫీజ్ జవాద్ అహ్మద్, ఎండీ.అసద్, ఎండీ.సాధిక్ అహ్మద్, హఫీజ్ జక్కీవుల్ల, షేక్ గౌసుద్దీన్, సయ్యద్ కరీం, షేక్ బాసిత్ అలీ, షేక్ మహబూబ్ పాషా, షేక్ అబ్దుల్ రెహమాన్, సయ్యద్ రషీద్, షేక్ గాలిబ్, షేక్ మహబూబ్ తదితరులు పాల్గొన్నారు.